నితిన్ సినిమాకు పాత టైటిల్

చదరంగం అనే పేరు చెప్పగానే మనకు అలనాటి పాత తెలుగు సినిమాలు కళ్లముందు మెదులుతాయి. ఈ పేరును అటుఇటు మార్చి, తెలుగుతెరపై చాలా చదరంగాలు వచ్చాయి. ఇప్పుడీ పాత చింతకాయపచ్చడి లాంటి టైటిల్ ను నితిన్ సినిమాకు పెట్టబోతున్నారు. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే నితిన్ కొత్త సినిమా టైటిల్ ఇదే.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాకు చదరంగం అనే టైటిల్ దాదాపు ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ పెట్టడం వెనక ఓ చిన్న లాజిక్ కూడా ఉంది. సినిమాలో చదరంగం ఆట ఉంటుంది. కొన్ని అనుకోని పరిస్థితుల మధ్య హీరో చదరంగం ఆట నేర్చుకుంటాడు. ఆ తర్వాత అతడి లైఫ్ మొత్తం ఈ చదరంగం మీద ఆధారపడిపోతుంది. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్ కరెక్ట్ అంటున్నారు.

ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాకు భీష్మ అనే టైటిల్ పెట్టారు. ఇది కూడా పాత టైటిలే. కాకపోతే ఎందుకో ఓల్డ్ అనిపించదు. కానీ చందరంగం అనే టైటిల్ మాత్రం పూర్తిగా పాత టైటిల్ అనిపిస్తోంది. దీనికి మేకర్స్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో చూడాలి.