చంచల్‌గూడ జైలులో రవిప్రకాశ్‌ ఇలా….

నిధుల దారి మళ్లింపు, ఫోర్జరీ కేసుల్లో గత కొద్దిరోజులుగా అరెస్ట్‌ కాకుండా తప్పించుకుంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఎట్టకేలకు చంచల్ గూడ జైలు జీవితాన్ని రుచిచూశారు.

టీవీ9 ఖాతా నుంచి కోట్లాది రూపాయల నిధులను అక్రమంగా దారి మళ్లించిన కేసులో అరెస్ట్ అయిన రవిప్రకాశ్‌ను రాత్రి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ విధించిన తర్వాత జైలుకు తరలించగా రవిప్రకాశ్‌ గుర్తింపు కోసం ఖైదీ నెంబర్‌ 4412ను కేటాయించారు. కృష్ణా బ్యారక్‌లో ఉంచారు. రవిప్రకాశ్ ఒక్కడినే ఒంటరిగా గదిలో ఉంచారు. ఊచల్లో నుంచి బయటకు చూస్తూ మౌనంగా రవిప్రకాశ్ చాలా సేపు ఉండిపోయాడట.

రాత్రంతా రవిప్రకాశ్‌ సరిగా నిద్రపోలేదని జైలు సిబ్బంది చెబుతున్నారు. గదిలో అటుఇటు తిరుగుతూ ఆలోచిస్తూ గడిపాడట. అక్కడున్న సిబ్బందితో కూడా మాట్లాడలేదట. ఏసీ లేకపోవడంతో ఆయన ఇబ్బందిపడ్డాడట.

ఉదయం ఆరు గంటలకు ముఖం కడుక్కున్న రవిప్రకాశ్‌ స్నానం చేయకుండా అలాగే ఉండిపోయాడట. అల్పాహారంగా కిచిడీ అందించగా… రుచికరంగా లేకపోవడంతో సగం మాత్రమే తిని వదిలేశాడట.

జైలులో వాకింగ్‌, జిమ్ లాంటివి ఏమీ చేయలేదట రవిప్రకాశ్‌. పడుకునేందుకు కూడా సరైన వసతి లేక ఇబ్బందిపడ్డాడని చెబుతున్నారు.