Telugu Global
NEWS

టెస్ట్ క్రికెట్లో అశ్విన్ మరో అరుదైన రికార్డు

అత్యంతవేగంగా 350 టెస్టు వికెట్ల అశ్విన్  మురళీధరన్ సరసన అశ్విన్ భారత స్పిన్ విజార్డ్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. శ్రీలంక స్పిన్ గ్రేట్ ముత్తయ్య మురళీధరన్ సరసన చోటు సంపాదించాడు. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 350 వికెట్లు పడగొట్టిన ఇద్దరు మొనగాళ్లలో ఒకడిగా నిలిచాడు. విశాఖపట్నం ఆంధ్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలిటెస్ట్ ఆఖరిరోజు ఆటలో…సఫారీ వన్ డౌన్ ఆటగాడు డి బ్రూయిన్ ను.. 10 […]

టెస్ట్ క్రికెట్లో అశ్విన్ మరో అరుదైన రికార్డు
X
  • అత్యంతవేగంగా 350 టెస్టు వికెట్ల అశ్విన్
  • మురళీధరన్ సరసన అశ్విన్

భారత స్పిన్ విజార్డ్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. శ్రీలంక స్పిన్ గ్రేట్ ముత్తయ్య మురళీధరన్ సరసన చోటు సంపాదించాడు.

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 350 వికెట్లు పడగొట్టిన ఇద్దరు మొనగాళ్లలో ఒకడిగా నిలిచాడు.

విశాఖపట్నం ఆంధ్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలిటెస్ట్ ఆఖరిరోజు ఆటలో…సఫారీ వన్ డౌన్ ఆటగాడు డి బ్రూయిన్ ను.. 10 పరుగుల స్కోరుకే క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా అశ్విన్ 350 వికెట్ల మైలురాయిని చేరుకోగలిగాడు.

విశాఖ టెస్టులో 8 వికెట్లు…

ఏడాది విరామం తర్వాత తన తొలిటెస్ట్ మ్యాచ్ ఆడిన అశ్విన్..తొలిఇన్నింగ్స్ లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్…మొత్తం 8 వికెట్లు సాధించడం ద్వారా.. భారత విజయంలో తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

తన కెరియర్ లో ఇప్పటి వరకూ 66 టెస్టులు ఆడిన అశ్విన్ కు 27సార్లు 5 వికెట్లు సాధించిన ఘనత ఉంది. మొత్తం 350 వికెట్లు పడగొట్టడంతో పాటు… బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా 4 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో 2 వేల 361 పరుగులు సాధించిన రికార్డు అశ్విన్ కు మాత్రమే సొంతం.

2018 తర్వాత టెస్టు క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం అశ్విన్ కు ఇదే మొదటిసారి.

కొత్త బంతితో వికెట్ల రికార్డు…

పాతబడిన లేదా నలిగిన బంతితోనే స్పిన్ బౌలర్లు వికెట్లు సాధించడం మనకు తెలుసు. అయితే…అశ్విన్ మాత్రం సరికొత్త బంతితో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఏకైక స్పిన్నర్ గా, ఐదో బౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

టెస్ట్ చరిత్రలో 66 టెస్టుల్లోనే 350 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పిన ముత్తయ్య మురళీధరన్ రికార్డును రవిచంద్రన్ అశ్విన్ సైతం కేవలం 66 టెస్టులతోనే సమం చేయడం విశేషం.

టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 350 వికెట్లు సాధించిన బౌలర్ల రికార్డును మురళీధరన్, అశ్విన్ కలసి పంచుకోడం విశేషం.

First Published:  6 Oct 2019 9:23 AM GMT
Next Story