సైరా నార్త్ లో ఎందుకు బెడిసికొట్టింది?

బాహుబలి-2కు దగ్గరగా వెళ్తుందని అంచనా వేశారు. రీసెంట్ గా వచ్చిన సాహోను బీట్ చేస్తుందని భావించారు. కానీ సైరా మాత్రం ఆదిలోనే చతికిలపడింది. ఉత్తరాదిన ఈ సినిమా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా, ఉత్తరాదిన మాత్రం పైకి చెప్పుకోలేని స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఈ 3 రోజుల్లో సైరా సినిమాకు నార్త్ లో కేవలం 4 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి.

సైరా, వార్ సినిమాల మధ్య భారీ పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ సైరా సినిమా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అటు వార్ సినిమా 3 రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టింది. నిజానికి నార్త్ లో సైరా-వార్ మధ్య ఎలాంటి పోటీ లేనప్పటికీ.. సాహో రేంజ్ కు సైరా వెళ్తుందని అంచనా వేశారు. సాహో సినిమా నార్త్ లో హిట్ అయింది. వంద కోట్లకు పైగా నెట్ వచ్చింది. కానీ సైరా మాత్రం ఏమాత్రం పోటీలో లేకుండా పోయింది

ఓవరాల్ గా నార్త్ లో 10 కోట్ల రూపాయల లోపే సైరా రన్ ముగిసేలా కనిపిస్తోంది. ఈ 4 రోజులు దాటితే సౌత్ లో సైరా ఆడొచ్చేమో కాని, నార్త్ లో మాత్రం ఈ సినిమా ఇక ఆడదనే విషయం తేలిపోయింది. సో.. ఉత్తరాదిన సైరా సినిమా ఫ్లాప్ అయినట్టే.