సైరాకు మరో ఎదురుదెబ్బ

సౌత్ లో ఇప్పటికే వసూళ్లు పడిపోయాయి. అటు నార్త్ లో ఆల్రెడీ ఫ్లాప్ అయింది. ఇక మిగిలిన ఒకే ఒక్క ఆశాదీపం ఓవర్సీస్ లో కూడా సైరాకు ఎదురుదెబ్బ తగిలింది. మరికొద్దిసేపట్లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి వెళ్తుందని అంతా భావిస్తుండగా.. అనుకోని విధంగా కొన్ని కీలక ప్రాంతాల్లో సైరా సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు.

ఓవర్సీస్ లోని టొరంటో, కెనడాలోని అన్ని థియేటర్లలో సైరా సినిమా ప్రదర్శనల్ని రద్దుచేశారు. వాటర్లూ పోలీస్ అధికారులు ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈ రద్దు ప్రభావం వసూళ్లపై గణనీయంగా పడబోతోంది. సైరా సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ లో ఓ వ్యక్తి ఊహించని విధంగా రియాక్ట్ అయ్యాడు. కత్తితో తెరను కోసేశాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకులపై పెప్పర్ స్ప్రే చల్లాడు.

ఊహించని ఈ ఘటనతో కొంతమంది గాయపడ్డారు. ఇలాంటిదే మరో ఘటన కెనడాలో కూడా జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. అందుకే కెనడాతో పాటు టొరంటోలోని అన్ని మల్టీప్లెక్సుల్లో సైరా సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఇది సైరాకు మరో ఎదురుదెబ్బగా మారింది.