టీఆర్‌ఎస్‌కు వైసీపీ మద్దతు… 2014లో వైసీపీ ఓట్ల శాతం ఇది

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ పోరు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య నడుస్తోంది. కాంగ్రెస్‌ నుంచి తాను విడిపోయానని బీజేపీ పెద్దలకు మేసేజ్ ఇచ్చే ఉద్దేశంతో చంద్రబాబు కూడా అక్కడ తన పార్టీ అభ్యర్థిని నిలబెట్టారు. ఫైట్ మాత్రం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ఉంది. ఇక్కడ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి భార్య స్వయంగా పోటీ చేస్తున్నారు.

పోటీ గట్టిగా ఉండడంతో ఇరు పార్టీలు మిగిలిన పార్టీల మద్దతు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. వైసీపీ మద్దతును టీఆర్‌ఎస్ కోరింది. టీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి… తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డిని కలిసి మద్దతు కోరారు. ఇందుకు వైసీపీ కూడా అంగీకరించింది. కాంగ్రెస్‌ను ఓడించాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

2014 ఎన్నికల్లో గట్టు శ్రీకాంత్ రెడ్డి హుజూర్‌నగర్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ విజయం సాధించగా…. టీఆర్‌ఎస్‌ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో వైసీపీ నిలిచింది. వైసీపీకి హుజుర్‌నగర్‌లో 16.6 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ నాలుగో స్థానానికి పరిమితమైంది. టీడీపికి 14.2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014లో వైసీపీకి భారీగానే ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఆపార్టీ మద్దతును టీఆర్‌ఎస్‌ తీసుకుంటోంది.