వినాయక్ రెడీ.. త్వరలోనే సెట్స్ పైకి

దర్శకుడు వీవీ వినాయక్ కొన్నాళ్లుగా మేకోవర్ అవుతున్న సంగతి తెలిసిందే. అతడు హీరోగా ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమా కోసం బరువు తగ్గే పనిలో వినాయక్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడా మేకోవర్ పూర్తయింది. తాజాగా వినాయక్ న్యూ లుక్ తో కొన్ని స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు.

నరసింహ దర్శకత్వంలో హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు వినాయక్. ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి కథతో రాబోతున్న ఈ సినిమా కోసం బాగా బరువు తగ్గాడు వినాయక్. ఇంకా తగ్గబోతుంటే, దర్శకుడు హెచ్చరించాడు. అలా మరీ స్లిమ్ గా కాకుండా, మరీ భారీగా బరువు పెరగకుండా మధ్యస్థంగా ఫిక్స్ అయ్యాడు వినాయక్.

దిల్ రాజు నిర్మాణంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది ఈ సినిమా. రీసెంట్ గా వినాయక్ తీసిన ఇంటెలిజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ మూవీ ఫ్లాప్ తర్వాత బాలయ్య హీరోగా ఓ సినిమా చేయడానికి ప్రయత్నించాడు వినాయక్. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇంతలోనే హీరోగా మారిపోయాడు ఈ స్టార్ డైరక్టర్.