Telugu Global
NEWS

విశాఖ టెస్టులో భారత్ హిట్

203 పరుగులతో భారత్ గెలుపు బ్యాటింగ్ లో రోహిత్,బౌలింగ్ లో షమీ షో ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో ప్రపంచ టాప్ ర్యాంకర్ భారత్ వరుసగా మూడో విజయం సాధించింది. మూడో ర్యాంకర్ సౌతాఫ్రికాతో ప్రారంభమైన తీన్మార్ సిరీస్ లోని తొలిటెస్ట్ ను భారత్ 203 పరుగుల భారీ తేడాతో నెగ్గి సత్తా చాటుకొంది. స్టీల్ సిటీ విశాఖలోని ఏసీఏ స్టేడియం వేదికగా ముగిసిన తొలిటెస్ట్ ఆఖరిరోజు ఆట లంచ్ విరామం తర్వాత సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ […]

విశాఖ టెస్టులో భారత్ హిట్
X
  • 203 పరుగులతో భారత్ గెలుపు
  • బ్యాటింగ్ లో రోహిత్,బౌలింగ్ లో షమీ షో

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో ప్రపంచ టాప్ ర్యాంకర్ భారత్ వరుసగా మూడో విజయం సాధించింది. మూడో ర్యాంకర్ సౌతాఫ్రికాతో ప్రారంభమైన తీన్మార్ సిరీస్ లోని తొలిటెస్ట్ ను భారత్ 203 పరుగుల భారీ తేడాతో నెగ్గి సత్తా చాటుకొంది.

స్టీల్ సిటీ విశాఖలోని ఏసీఏ స్టేడియం వేదికగా ముగిసిన తొలిటెస్ట్ ఆఖరిరోజు ఆట లంచ్ విరామం తర్వాత సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 191 పరుగులకే కుప్పకూలడంతో ఆతిథ్య భారత్ 203 పరుగులతో విజయాన్ని సొంతం చేసుకొంది.

షమీ రివర్స్…కింగ్…

395 పరుగుల భారీ లక్ష్యంతో ….ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టానికి 11 పరుగులతో ఆఖరిరోజు ఆట ప్రారంభించిన సఫారీజట్టు… ప్రారంభ ఓవర్లలోనే డి బ్రూయిన్ వికెట్ కోల్పోయింది. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ లో డి బ్రూయిన్ క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. ప్రస్తుత మ్యాచ్ లో అశ్విన్ కు ఇది 8వ వికెట్ కావడం విశేషం.

ఆ తర్వాత బౌలింగ్ కు దిగిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ…వికెట్ పైన అనూహ్యమైన బౌన్స్ ను తనకు అనువుగా మలచుకొని చెలరేగిపోయాడు. రివర్స్ స్వింగ్ తో కంగారూ టాపార్డర్ ను బెంబేలెత్తించాడు.

సౌతాఫ్రికా టాపార్డర్ ఆటగాళ్లు బవుమా, కెప్టెన్ డూప్లెసిస్, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో క్వింటన్ డీ కాక్ లను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా…షమీ భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.

ఓపెనర్ మర్కరమ్ ,మిడిలార్డర్ ఆటగాళ్లు మహారాజ్, విలాండర్ లను స్పిన్నర్ జడేజా పెవీలియన్ దారి పట్టించాడు. అయితే…లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు పీట్-ముత్తుస్వామి 9వ వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యంతో పోరాటం కొనసాగించినా ప్రయోజనం లేకపోయింది.

ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 35 పరుగులిచ్చి 5 వికెట్లు, జడేజా 4 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టి…సఫారీ ఇన్నింగ్స్ తో పాటు మ్యాచ్ కు తెరదించారు.

టెస్ట్ క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం షమీకి ఇది ఐదోసారి మాత్రమే.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్…

రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు బాదిన భారత ఓపెనర్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని రెండోటెస్ట్ మ్యాచ్ పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా అక్టోబర్ 10న ప్రారంభంకానుంది.

First Published:  6 Oct 2019 9:13 AM GMT
Next Story