కైరా అద్వానీ పాత్ర లో అమలా పాల్

బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ అనే టైటిల్ తో నెట్ ఫ్లిక్స్ లో ఒక నాలుగు లఘు చిత్రాలు వచ్చిన సంగతి మనకి తెలిసిందే. బోల్డ్ కథల తో, అబ్బురపరిచే నటన తో నలుగురు దర్శకులు నాలుగు చిత్రాలని తీశారు.

అయితే ఇప్పుడు దీనిని తెలుగు లో రీమేక్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి మరియు నందిని రెడ్డి కలిసి ఈ లస్ట్ స్టోరీస్ ని తెలుగు లోకి తీసుకొని వస్తున్నారు.

వీటిల్లో నందిని రెడ్డి దర్శకత్వం చేసే లఘు చిత్రం హిందీ లో కరణ్ జోహార్ చేశారు. కైరా అద్వానీ మరియు విక్కీ కౌశల్ నటించిన ఈ చిత్రం లో ఇప్పుడు అమలా పాల్ నటించనుంది. కైరా అద్వానీ చేసిన పాత్ర ని రీమేక్ లో అమలా పాల్ చేయనుంది అనేది సమాచారం. రోనీ స్క్రవాలా ఈ ఒరిజినల్ ను తెలుగు లో నిర్మిస్తారు. బోల్డ్ పాత్ర లో అమలా పాల్ కనిపించనుంది.

ఇక నందిని రెడ్డి తన కథ తో షూట్ కి రెడీ అవుతుండగా మిగిలిన దర్శకులు స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.