జపాన్ ఓపెన్ కింగ్ జోకోవిచ్

  • ప్రపంచ నంబర్ వన్ ఖాతాలో 76వ టైటిల్

ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ నొవాక్ జోకోవిచ్…ఎట్టకేలకు జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకొన్నాడు. టోక్యో వేదికగా ముగిసిన 2019టోర్నీ ఫైనల్లో ఆస్ట్ర్రేలియా ఆటగాడు జాన్ మిల్ మాన్ ను టాప్ సీడ్ జోకోవిచ్ 6-3, 6-2 తో చిత్తు చేసి…తన కెరియర్ లో తొలిసారిగా జపాన్ ఓపెన్ ట్రోఫీని అందుకొన్నాడు.

ప్రత్యర్థులకు ఒక్క సెట్టు ఇవ్వకుండా జోకోవిచ్ విజేతగా నిలవడం విశేషం.

ఏకపక్షంగా సాగిన టైటిల్ సమరాన్ని 32 ఏళ్ల జోకోవిచ్ కేవలం 67 నిముషాలలోనే ముగించాడు. అమెరికన్ ఓపెన్ నాలుగో రౌండ్లోనే నిష్క్ర్రమించిన తర్వాత జోకోవిచ్ ఓ ఏటీపీ టైటిల్ నెగ్గడం ఇదే మొదటిసారి.

ఇప్పటి వరకూ 16 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జోకోవిచ్ …ప్రస్తుత జపాన్ టైటిల్ తో తన ట్రోఫీల సంఖ్యను 76కు పెంచుకోగలిగాడు.