పోకిరి సీక్వెల్… కానీ హీరో మహేష్ కాదు

పూరి జగన్నాథ్ దర్శకత్వం లో మహేష్ బాబు హీరో గా నటించిన మొదటి సినిమా పోకిరి. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అనే విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా విజయం మహేష్ ని తిరుగులేని స్టార్ గా మార్చింది.

పోకిరి సినిమా ని వేరే భాషల్లో కి రీమేక్ చేసిన సంగతీ తెలిసిందే. తమిళం లో స్టార్ హీరో విజయ్ ఈ సినిమా లో నటించగా, హిందీ లో సల్మాన్ ఖాన్ నటించాడు. వాంటెడ్ అనే పేరు తో ఈ సినిమా హిందీ లో విడుదలై భారీ కలెక్షన్స్ రాబట్టింది.

అయితే తాజాగా బాలీవుడ్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం, ఈ సినిమా కి సీక్వెల్ ని చేయాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నాడట. సాధారణం గా ఒరిజినల్ లో సీక్వెల్ తీశాక… దానిని మళ్ళీ తీస్తారు కానీ…. ఇక్కడ పూరి కానీ, మహేష్ కానీ సీక్వెల్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. కానీ సల్మాన్ మాత్రం రెడీ గా ఉన్నాడట.

ప్రభు దేవా ఈ సినిమా కి దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే ప్రభుదేవా సల్మాన్ తో దబాంగ్ 3 ని పూర్తి చేసిన తరుణం లో ఈ విషయం ఆసక్తి రేపుతోంది.