హాకీ కథాంశం తో…. ‘A1 ఎక్స్ ప్రెస్’

యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఇటీవలే హీరో గా మరియు నిర్మాత గా…. నిను వీడని నీడను నేనే అనే సినిమా తో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్ కి బాగా హెల్ప్ అయింది అని చెప్పుకోవచ్చు. ఈ విజయంతో సందీప్ కిషన్ కొత్త చిత్రాలను మొదలు పెట్టాడు. అందులో ఒక సినిమా టైటిల్ తెనాలి రామకృష్ణ. ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీద ఉంది. నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు.

అది పక్కన పెడితే, ఇప్పుడు సందీప్ ఒక కొత్త చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతుంది. వినూత్నం గా హాకీ నేపథ్యం లో ఈ సినిమా కథ ఉండనుంది. ఈ సినిమా కి సంబదించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

‘ఏ వన్ ఎక్స్ ప్రెస్’ టైటిల్ తో రానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లో సందీప్ హాకీ స్టిక్ భుజాన పెట్టుకొని, క్రీడా దుస్తులలో మైదానం వైపు చూస్తున్నట్టు గా ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఏ ఏ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ సంయుక్తంగా ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.