పూరి సెంటిమెంట్… విజయ్ వింటాడా?

విజయ్ దేవరకొండ హీరో గా నటించిన డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయితే ఈ సారి ఈ హీరో తన స్టైల్ ని మార్చుకొని పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఒక సినిమా ని ఒప్పుకున్నాడు.

షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది మొదలు కావాలి. అయితే దర్శకుడు పూరి జగన్ మాత్రం ఎలాగైనా ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ ని ఈ సంవత్సరమే అంటే డిసెంబర్ లోనే కనీసం ఒక మూడు రోజులు అయినా షూటింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.

అయితే  విజయ్ దేవరకొండ బిజీ గా ఉండటం, ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలని పూర్తి చేసే పనిలో పడ్డాడు.  ఎలాగైనా విజయ్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట పూరి.

దీని వెనుక పూరికి ఉన్న ఒక బలమైన సెంటిమెంట్ కారణం అని అంటున్నారు. చాలా ఏళ్ళకి పూరి కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ అనే విజయం వచ్చింది. దీంతో ఈ సంవత్సరాన్ని లక్కీ ఇయర్ గా పూరి అనుకుంటున్నాడట.

అందుకే ఈ సినిమా ని కూడా ఈ సంవత్సరమే సెట్స్ పైకి తీసుకొని వెళితే బాగుంటుంది అనేది పూరి నమ్మకమట. అందుకే ఎలాగైనా విజయ్ ని ఒప్పించాలని చూస్తున్నాడు. మరి పూరి మాట ని విజయ్ వింటాడో లేదో చూడాలి.