9 నుంచి భారత్-సౌతాఫ్రికా వన్డే మహిళా సిరీస్

  • వడోదర వేదికగా తీన్మార్ సమరం
  • కాలివేలి గాయంతో స్మృతి మంథానా అవుట్

సౌతాఫ్రికా మహిళాజట్టుతో తీన్మార్ వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే ఆతిథ్య భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. డాషింగ్ ఓపెనర్ కమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంథానా కాలివేలి గాయంతో సిరీస్ మొత్తానికీ దూరమయ్యింది.

సఫారీ మహిళలతో ముగిసిన ఆరుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో పాల్గొన్న స్మృతి దారుణంగా విఫలమయ్యింది. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మంథానా 21, 13, 7, 5 స్కోర్లు మాత్రమే సాధించింది. మంథానా స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ పూజా వస్త్రకార్ కు చోటు కల్పించినట్లు మహిళాజట్టు కోచ్ రామన్ ప్రకటించారు.

మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారతజట్టు వడోదర వేదికగా అక్టోబర్ 9, 11, 14 తేదీలలో సఫారీలతో వన్డే సిరీస్ లో తలపడనుంది.

భారతజట్టులోని ఇతర ప్లేయర్లలో. .హర్మన్ ప్రీత్ కౌర్, తాన్యా భాటియా, ఏక్తా బిస్త్, రాజేశ్వరి గయక్వాడ్, జులన్ గోస్వామి, హేమలత, మానసీ జోషీ, పూజా వస్త్రకర్, శిఖా పాండే, పూనం యాదవ్, ప్రియా పూనియా, పూనమ్ రౌత్, జెమీమా రోడ్రిగేస్, దీప్తి శర్మ ఉన్నారు.