Telugu Global
National

బెంగాల్ లో ఒక కుటుంబం దసరా వేడుకను ఇలా జరుపుకుంది....

బెంగాల్ కి చెందిన దత్తా కుటుంబం దుర్గా పూజను 2013 నుండి తమ ఇంట్లో జరుపుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం వారు ఎప్పుడూ అనుసరిస్తున్న సంప్రదాయానికి వ్యతిరేకం గా పూజ నిర్వహించి “దేశ సమగ్రత, మత సామరస్యం” పెంపొందించే గొప్ప సంప్రదాయానికి ఒక ప్రతీక ను పూజ లో నిలిపారు. బాగూహతిలోని అర్జున్‌పూర్‌లో ఉంటున్న కమర్హతి మునిసిపాలిటీకి చెందిన ఇంజనీర్ తమల్ దత్తా ఆహ్వానం మేరకు నాలుగేళ్ల ఫాతిమా అనే ముస్లిం పాప కోల్‌కతాకు వచ్చింది. ఈ […]

బెంగాల్ లో ఒక కుటుంబం దసరా వేడుకను ఇలా జరుపుకుంది....
X

బెంగాల్ కి చెందిన దత్తా కుటుంబం దుర్గా పూజను 2013 నుండి తమ ఇంట్లో జరుపుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం వారు ఎప్పుడూ అనుసరిస్తున్న సంప్రదాయానికి వ్యతిరేకం గా పూజ నిర్వహించి “దేశ సమగ్రత, మత సామరస్యం” పెంపొందించే గొప్ప సంప్రదాయానికి ఒక ప్రతీక ను పూజ లో నిలిపారు.

బాగూహతిలోని అర్జున్‌పూర్‌లో ఉంటున్న కమర్హతి మునిసిపాలిటీకి చెందిన ఇంజనీర్ తమల్ దత్తా ఆహ్వానం మేరకు నాలుగేళ్ల ఫాతిమా అనే ముస్లిం పాప కోల్‌కతాకు వచ్చింది. ఈ ముస్లిం బాలికను ఆదివారం కుమారిగా హిందువులైన దత్తా కుటుంబం ఆరాధించింది.

చిన్న బాలికను దసరా నవరాత్రుల సందర్భంగా కుమారి (దుర్గ ప్రతి రూపం) గా అలంకరించి పూజలు చేయడం బెంగాల్ హిందూ కుటుంబాలలో గత వందేళ్ల నుంచి కొనసాగుతున్న ఆచారం.

ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ సిక్రీ ప్రాంతం లో కిరాణా దుకాణ యజమాని కుమార్తె ఫాతిమా. కమర్హతి మునిసిపాలిటీకి చెందిన ఇంజనీర్ తమల్ దత్తా ఆహ్వానం మేరకు… కోల్కతా సివారున ఉన్న అర్జుంపూర్-గుయిహాటి కి వచ్చారు. ఫాతిమా బంధువులు అహ్మద్, ఇబ్రహీం; తల్లి బుష్రా బేగం కూడా దత్తా ఇంటికి వచ్చారు.

దుర్గా పూజలో బాలికలను పూజించే సంప్రదాయాన్ని స్వామి వివేకానంద ప్రారంభించినట్లు చెబుతారు. మహిళల ప్రాముఖ్యతను ఎత్తిచూపడానికి 1901 లో బేలూర్ మఠంలో కుమారి పూజను ఆయన ప్రారంభించారట. అప్పటి నుంచి బెంగాలీలు కుమారీ పూజలు ఒక ఆచారంలో భాగంగా చేస్తున్నారు.

తాను 2013 నుండి దుర్గా పూజలు జరుపుకుంటున్నానని తమల్ దత్తా అన్నారు. ”మేము మొదట బ్రాహ్మణ అమ్మాయితో ప్రారంభించాము. కానీ తరువాతి సంవత్సరాల్లో, ఒక దళిత బాలికతో సహా బ్రాహ్మణేతర అమ్మాయిలను కుమారిగా ఎన్నుకున్నాము. ఈసారి, మేము ఒక ముస్లిం అమ్మాయిని ఆరాధించాలని అనుకున్నాం” అని ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు.

మీడియా పదే పదే ముస్లిం అమ్మాయినే కుమారిగా ఎందుకు ఎంచుకున్నారని అడిగినప్పుడు… “ఆమె ముస్లింలా కనిపిస్తుందా? ముస్లిం లాగా ఎలా ఉంది? నేను ఒక ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధ లేదా జైనులలో బ్రాహ్మణ లక్షణాలను చూడగలను” అంటూ విలేకర్లతో అన్నారు దత్తా.

మరోవైపు, ఫాతిమాను కుమారిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని అహ్మద్ అన్నారు. “ఈ దేశం అందరిదీ. హిందువులకు ఎంత స్థానం ఉందో ముస్లింలకు కూడా అంతే ఉంది. ఈ పూజ రెండు మతాల సభ్యులు కలిసి శాంతితో జీవించాలనుకుంటున్న సందేశాన్ని ఇస్తున్నద”ని అన్నారు. ఫాతిమా తల్లి బుష్రా బేగం మాట్లాడుతూ… “నేను హిందూ, ముస్లిం అనే భావాలను నమ్మను. మానవత్వాన్నే నమ్ముతాను” అన్నారు.

First Published:  7 Oct 2019 11:33 PM GMT
Next Story