Telugu Global
NEWS

2024 ఒలింపిక్స్ లో కబడ్డీకి చోటు?

కబడ్డీకి చోటు కోసం భారత్ కృషి 87 దేశాలలో కబడ్డీకి ఆదరణ దక్షిణాసియా దేశాల గ్రామీణ క్రీడ కబడ్డీకి వచ్చే ఒలింపిక్స్ లో చోటు కల్పించడమే తమ లక్ష్యమని భారత క్రీడామంత్రి కిరణ్ రిజ్జూ ప్రకటించారు. ఇప్పటి వరకూ ఆసియాక్రీడలకే పరిమితమైన కబడ్డీకి ప్రపంచ వ్యాప్తంగా 87 కు పైగా దేశాలలో ఆదరణ ఉందని…క్రీడ ఏదైనా కనీసం 80 దేశాలలో గుర్తింపు ఉంటే…ఒలింపిక్స్ లో ప్రధాన క్రీడాంశంగా చేర్చే అవకాశం ఉంటుంది. 1990 బీజింగ్ ఆసియా క్రీడల్లో… తొలిసారిగా […]

2024 ఒలింపిక్స్ లో కబడ్డీకి చోటు?
X
  • కబడ్డీకి చోటు కోసం భారత్ కృషి
  • 87 దేశాలలో కబడ్డీకి ఆదరణ

దక్షిణాసియా దేశాల గ్రామీణ క్రీడ కబడ్డీకి వచ్చే ఒలింపిక్స్ లో చోటు కల్పించడమే తమ లక్ష్యమని భారత క్రీడామంత్రి కిరణ్ రిజ్జూ ప్రకటించారు.

ఇప్పటి వరకూ ఆసియాక్రీడలకే పరిమితమైన కబడ్డీకి ప్రపంచ వ్యాప్తంగా 87 కు పైగా దేశాలలో ఆదరణ ఉందని…క్రీడ ఏదైనా కనీసం 80 దేశాలలో గుర్తింపు ఉంటే…ఒలింపిక్స్ లో ప్రధాన క్రీడాంశంగా చేర్చే అవకాశం ఉంటుంది.

1990 బీజింగ్ ఆసియా క్రీడల్లో… తొలిసారిగా కబడ్డీని పతకం అంశంగా ప్రవేశపెట్టారు.1990 నుంచి 2014 ఏషియాడ్ వరకూ వరుసగా ఏడుసార్లు బంగారు పతకాలు నెగ్గి… చరిత్ర సృష్టించిన భారత్ కు…గత ఆసియాక్రీడల్లో మాత్రం ఇరాన్ షాకిచ్చింది.

పురుషుల విభాగంలో కాంస్య, మహిళల విభాగంలో రజత పతకాలతో భారత్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆసియా దేశాలలో భారత్ తో పాటు ఇరాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సైతం కబడ్డీ క్రీడలో శక్తిగా ఎదిగాయి.

భారత్ వేదికగా గత ఏడు సీజన్లుగా జరుగుతున్న ప్రో-కబడ్డీలీగ్ తో ఈ గ్రామీణ క్రీడకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు రావడమే కాదు…అభిమానుల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది.

First Published:  7 Oct 2019 6:03 PM GMT
Next Story