ఆరు రోజుల్లో 75 కోట్లు గడించిన ‘సై రా’

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమాగా విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలైంది. ఇప్పటికీ విడుదలై ఆరు రోజులు గడిచినప్పటికీ సినిమా కలెక్షన్లు స్టడీ గా ఉండటం విశేషం.

సోమవారం నాడు ‘సైరా’ సినిమా 5.50 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసుకోగా ఆరు రోజులలో మొత్తం షేర్ ను 75 కోట్లకు చేరింది. అయితే సైరా సినిమా వసూళ్ళలో ఆదివారం నుంచి 35% డ్రాప్ కూడా కనిపిస్తోంది. అయినప్పటికీ సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంటుందని చెప్పవచ్చు.

నైట్ షో లలో కూడా సైరా సినిమా కి కలెక్షన్లు బాగానే అందుతున్నాయి. అయితే ఇవాళ్టితో దసరా సెలవులు పూర్తి అవుతాయి కాబట్టి రేపటి నుంచి సినిమా కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఆరు రోజులలో సైరా సినిమా ఏరియావైజ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

నిజాం: 21.67 కోట్లు
సీడెడ్: 13.30 కోట్లు
యూఏ: 10.75 కోట్లు
గుంటూరు: 7.83 కోట్లు
ఈస్ట్: 6.97 కోట్లు
వెస్ట్: 5.47 కోట్లు
కృష్ణ: 5.79 కోట్లు
నెల్లూరు: 3.40 కోట్లు

ఏపీ+తెలంగాణ: 75.18 కోట్లు