టీజర్ టాక్: ఎంత మంచివాడవురా!

కళ్యాణ్ రామ్ నందమూరి హీరో గా, శతమానం భవతి మరియు శ్రీనివాస కళ్యాణం సినిమాలని దర్శకత్వం చేసిన సతీష్ వేగేశ్న, “ఎంత మంచివాడవురా” అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భం లో ఈ సినిమా యూనిట్ ఈ రోజు టీజర్ ని విడుదల చేసింది. ఈ సినిమా టీజర్ లో ఆసక్తికర అంశాల తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ మెండు గా ఉన్నాయి.

కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా తన కెరీర్ లో ఒక ప్రత్యేక చిత్రం గా నిలవనుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇంత ఫుల్ లెన్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయని కళ్యాణ్ రామ్ ఈ సినిమా తో ఆ కోరిక ని తీర్చుకుంటున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఈ సినిమా టీజర్ చూస్తే అందరూ హీరో ని మంచివాడు మంచివాడు అని తెగ పొగిడేస్తుంటారు… కానీ మరో పక్క హీరో మాత్రం రౌడీలని చితకబడుతూ ఉంటాడు. అప్పుడు కళ్యాణ్ రామ్, “రాముడు కూడా మంచోడే…. కానీ రావణాసురుడిని చంపేయలేదా” అంటాడు.

ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ సినిమా తో సినిమా నిర్మాణం లో కి అడుగు పెడుతుంది. టీజర్ అయితే బాగానే ఆకట్టుకుంటోంది… ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.