సాహో హీరోయిన్ కు పెళ్లి

సాహో సినిమాతో సౌత్ లో కూడా పాపులర్ అయింది ఎవ్లీన్ శర్మ. 2012 నుంచి బాలీవుడ్ లో కొనసాగుతున్నప్పటికీ సాహో సినిమా తర్వాత ఆమెకు ఎక్కువ క్రేజ్ వచ్చింది. అలా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారింది. అవును.. ఎవ్లీన్ శర్మ ఎంగేజ్ మెంట్ పూర్తయింది.

దాదాపు రెండేళ్లుగా ఆస్ట్రేలియాకు చెందిన తుషాన్ తో డేటింగ్ చేస్తోంది ఎవ్లీన్. ఇతడు అక్కడ డెంటల్ సర్జన్ గా పనిచేస్తున్నాడు. కేవలం సర్జన్ మాత్రమే కాదు, అక్కడ ఇతడు ఔత్సాహిక పారిశ్రామికవేత్త కూడా. రెండేళ్ల కిందట ఓ పార్టీలో కలిసి వీళ్లిద్దరూ డేటింగ్ తో ఒక్కటయ్యారు. ఇప్పుడు ఏకంగా కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు.

సిడ్నీ హార్బర్ సమీపంలో ఎవ్లీన్-తుషాన్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఎవ్లీన్ స్వయంగా వెల్లడించింది. తనకు, ఇషాన్ కు నిశ్చితార్థం జరిగిందనే విషయాన్ని ఇనస్టాగ్రామ్ లో అఫీషియల్ గా ప్రకటించిన ఎవ్లీన్, అందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా పోస్ట్ చేసింది.

జర్మనీలో పుట్టిపెరిగిన ఈ భారతీయ యువతి, 2012లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రణబీర్ నటించిన యే జవానీ హే దివానీ సినిమాతో చిన్న గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సాహోతో ఏకంగా బాలీవుడ్ లో క్రేజీ స్టార్ అనిపించుకుంది.

View this post on Instagram

Yessss!!! ?????

A post shared by Evelyn Sharma (@evelyn_sharma) on