కొరటాల-దేవి కాంబినేషన్ కి అఫీషియల్ బ్రేక్ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముచ్చటగా మూడో సారి చిరంజీవి తో సినిమా నిర్మిస్తున్నారు. ఖైదీ నెం.150, సై రా నరసింహ రెడ్డి వంటి సినిమాల తర్వాత మరోసారి రామ్ చరణ్ చిరంజీవి తో సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాకి కొరటాల శివ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కొరటాల ఎప్పటి నుంచో చిరంజీవి తో కలిసి పనిచేయాలి అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పుడో మొదలయ్యాయి. ఈ సినిమా కి రామ్ చరణ్ తో పాటు మరొక నిర్మాత కూడా భాగస్వామి కాబోతున్నాడు.

ఆసక్తికర విషయం ఏంటి అంటే ఈ సినిమా కి సంగీత దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. ఎప్పటి నుంచో ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడి గా ఉండడం లేదు అనే విషయం మీడియా లో చక్కర్లు కొడుతోంది. కాకపోతే కొరటాల శివ తన అన్ని సినిమాలకి ఇప్పటి దాకా దేవి ని పెట్టుకోవడం తో ఈ సినిమా కి కూడా పెట్టుకుంటారు అని అందరూ అనుకున్నారు.

నిన్న జరిగిన సినిమా లాంచ్ కార్యక్రమం లో దేవి పేరు బయటకు రాలేదు. ఛాయాగ్రాహకుడు, ఎడిటర్ ని ఖరారు చేసారు… కానీ సంగీత దర్శకుడిని ఇంకా ఖరారు చేయకపోవడం తో ఈ కాంబినేషన్ కి అఫీషియల్ గా బ్రేక్ పడ్డట్టు అయింది.