Telugu Global
Cinema & Entertainment

సైరా మొదటి వారం వసూళ్లు

మొత్తానికి కిందామీదా పడి మొదటి వారం పూర్తిచేసుకుంది సైరా. వారం తిరిగేసరికి కమర్షియల్ గా ఈ సినిమా ఫ్లాప్ అనిపించుకుంది. తెలుగు రాష్ట్రాల సంగతి పక్కనపెడితే.. అటు నార్త్, ఇటు కర్నాటక, తమిళనాడు.. మరోవైపు ఓవర్సీస్ లో ఈ సినిమాకు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఎంత తక్కువ అంటే.. కనీసం బ్రేక్-ఈవెన్ కు కూడా దగ్గరగా లేవు ఆ కలెక్షన్లు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొద్దాం. ఇక్కడ సైరాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. కానీ వాస్తవంగా […]

సైరా మొదటి వారం వసూళ్లు
X

మొత్తానికి కిందామీదా పడి మొదటి వారం పూర్తిచేసుకుంది సైరా. వారం తిరిగేసరికి కమర్షియల్ గా ఈ సినిమా ఫ్లాప్ అనిపించుకుంది. తెలుగు రాష్ట్రాల సంగతి పక్కనపెడితే.. అటు నార్త్, ఇటు కర్నాటక, తమిళనాడు.. మరోవైపు ఓవర్సీస్ లో ఈ సినిమాకు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఎంత తక్కువ అంటే.. కనీసం బ్రేక్-ఈవెన్ కు కూడా దగ్గరగా లేవు ఆ కలెక్షన్లు.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొద్దాం. ఇక్కడ సైరాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. కానీ వాస్తవంగా చూస్తే అవి సరిపోవు. విడుదలైన వారం రోజులకే బాహుబలి-2 సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. కానీ సైరా మాత్రం 75 శాతం మాత్రమే రికవర్ అయింది. మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 83 కోట్ల 23 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అటు వరల్డ్ వైడ్ మాత్రం ఈ సినిమా వంద కోట్ల షేర్ మార్క్ అందుకుంది. గ్రాస్ పరంగా చూస్తే.. 150 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 23.95 కోట్లు
సీడెడ్ – రూ. 15 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 12.30 కోట్లు
ఈస్ట్ – రూ. 7.45 కోట్లు
వెస్ట్ – రూ. 5.75 కోట్లు
గుంటూరు – రూ. 8.45 కోట్లు
నెల్లూరు – రూ. 3.90 కోట్లు
కృష్ణా – రూ. 6.43 కోట్లు

First Published:  9 Oct 2019 6:58 AM GMT
Next Story