Telugu Global
NEWS

జగన్‌ వద్దకు నెల్లూరు పంచాయతీ

నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల అధిపత్యపోరుపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, కాకాణి గోవర్దన్‌ రెడ్డి మధ్య చెలరేగిన వివాదాన్ని జగన్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలతో నేడు జగన్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండడంపై సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిపై ఎంపీడీవో ఫిర్యాదు చేయడం, ఆమె ఫిర్యాదు వెనుక కాకాణి […]

జగన్‌ వద్దకు నెల్లూరు పంచాయతీ
X

నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల అధిపత్యపోరుపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, కాకాణి గోవర్దన్‌ రెడ్డి మధ్య చెలరేగిన వివాదాన్ని జగన్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలతో నేడు జగన్‌ సమావేశం నిర్వహిస్తున్నారు.

జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండడంపై సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిపై ఎంపీడీవో ఫిర్యాదు చేయడం, ఆమె ఫిర్యాదు వెనుక కాకాణి గోవర్దన్‌ రెడ్డి హస్తముందని తెలియడంతో వైసీపీ నాయకత్వం ఆగ్రహంగా ఉంది.

వ్యక్తిగత పోరు వల్ల చివరకు పార్టీ పరువుపోయిందన్న అభిప్రాయంతో జగన్ ఉన్నారు. వాటర్ పైప్‌లైన్ అనుమతుల చిన్నపనికి కాకాణి గోవర్దన్ రెడ్డి అడ్డుపడడం, అది పెద్ద వివాదంగా మారి ఏకంగా కోటంరెడ్డి అరెస్ట్ వరకు వెళ్లడం రాష్ట్రంలోనే చర్చనీయాంశమైంది. వైసీపీలో క్రమశిక్షణ లేకుండాపోయిందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో నేడు జిల్లానేతలతో జగన్‌ సమావేశం కాబోతున్నారు. ఈనెల 15న నెల్లూరు జిల్లాలో రైతుభరోసా కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమావేశంలో ఆ అంశంపైనా చర్చ జరగనుంది.

First Published:  8 Oct 2019 8:34 PM GMT
Next Story