పవన్… వారసుడిని ఇలా పరిచయం చేయబోతున్నాడా?

మరో మెగా వారసుడు రెడీ అవుతున్నాడు. పవన్ కొడుకు హీరోగా మారబోతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే పవన్ తనయుడు అకిరా నందన్ హీరోగా సినిమా ఓపెనింగ్ ఉంటుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో జోరుగా నడుస్తున్న చర్చ ఇది. ఇందులో నిజానిజాల సంగతి తెలియదు కానీ నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అకిరా చదువుకుంటున్నాడు. అతడి చదువు పూర్తయ్యేవరకు సినిమాల్లోకి పంపించడం ఇష్టంలేదని అతడి తల్లి రేణుదేశాయ్ ఇప్పటికే స్పష్టంచేశారు. అయినప్పటికీ అకిరా నందన్ డెబ్యూపై కథనాలు వస్తూనే ఉన్నాయి.

ఈ మేటర్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏంటంటే.. కొడుకు డెబ్యూను రామ్ చరణ్ చేతిలో పెట్టారట పవన్. ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నాడు పవన్. ఇలాంటి టైమ్ లో కొడుకు అరంగేట్రానికి సంబంధించిన పనుల్ని చూసుకోలేరు. అందుకే ఆ బాధ్యతలన్నింటినీ రామ్ చరణ్ కు అప్పగించినట్టు తెలుస్తోంది. అంటే.. అకిరా డెబ్యూ చరణ్ చేతుల మీదుగా జరుగుతుందన్నమాట.

అయితే ప్రస్తుతానికి ఇవన్నీ పుకార్ల స్థాయిలోనే ఉన్నాయి. వీటిలో ఒక్క అంశంపై కూడా అధికారిక ప్రకటన లేదు. అన్నింటికీ మించి అకిరాకు హీరోగా ఎదిగేంత వయసు ఇంకా రాలేదు. అతడింకా చదువుకుంటున్నాడు. సో.. అకిరా డెబ్యూకు ఇంకాస్త సమయం పట్టొచ్చు. కాకపోతే ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితుల బట్టి చూస్తే, అది రామ్ చరణ్ చేతుల మీదుగానే జరగే అవకాశం ఉంది.