Telugu Global
NEWS

అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు...

వైఎస్ జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇవ్వాలని నిర్ణయించారు.ఈ నిర్ణయం అమలు కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రిజర్వేషన్లలో 50 శాతం మహిళలకు వాటా ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో లక్షకు పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా నేరుగా కాకుండా వివిధ ఏజెన్సీల ద్వారా వచ్చారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు సరైన అవకాశాలు […]

అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు...
X

వైఎస్ జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇవ్వాలని నిర్ణయించారు.ఈ నిర్ణయం అమలు కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రిజర్వేషన్లలో 50 శాతం మహిళలకు వాటా ఉంటుంది.

ఇప్పటికే రాష్ట్రంలో లక్షకు పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా నేరుగా కాకుండా వివిధ ఏజెన్సీల ద్వారా వచ్చారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు సరైన అవకాశాలు దక్కడం లేదన్న విమర్శ ఉంది. దీన్ని పరిష్కరించేందుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ఏర్పాటు చేసే కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లాల స్థాయిలోనూ విభాగాలుంటాయి. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రులు ఈ విభాగాలకు నేతృత్వం వహిస్తారు. కలెక్టర్ ఎక్స్ అఫిషియోగా ఉంటారు.

ఈనెల 16న జరిగే కేబినెట్ భేటీలో ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేయనున్నారు. డిసెంబర్‌ 1నుంచి కార్పొరేషన్ పనిచేస్తుంది. ఇకపై ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా ఈ కార్పొరేషన్ ద్వారానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లో అవుట్‌ సోర్సింగ్‌ కింద పని చేస్తున్న వారికి ఒకే పనికి ఒకే రకమైన జీతం చెల్లించనున్నారు.

First Published:  9 Oct 2019 6:54 PM GMT
Next Story