Telugu Global
NEWS

టెస్ట్ కెప్టెన్ గా కొహ్లీ 50మ్యాచ్ ల రికార్డు

పూణే టెస్టుతో కెప్టెన్ గా హాఫ్ సెంచరీ సాంప్రదాయ టెస్టు క్రికెట్లో 50 మ్యాచ్ ల్లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రెండో ఆటగాడిగా విరాట్ కొహ్లీ నిలువబోతున్నాడు. సౌతాఫ్రికాతో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా గురువారం ప్రారంభమయ్యే రెండోటెస్టుతో..కెప్టెన్ గా కొహ్లీ 50 మ్యాచ్ ల మైలురాయిని చేరనున్నాడు. సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న 49 టెస్టుల రికార్డును అధిగమించి ..గతంలో ఇదే ఘనత సాధించిన మహేంద్ర […]

టెస్ట్ కెప్టెన్ గా కొహ్లీ 50మ్యాచ్ ల రికార్డు
X
  • పూణే టెస్టుతో కెప్టెన్ గా హాఫ్ సెంచరీ

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో 50 మ్యాచ్ ల్లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రెండో ఆటగాడిగా విరాట్ కొహ్లీ నిలువబోతున్నాడు. సౌతాఫ్రికాతో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా గురువారం ప్రారంభమయ్యే రెండోటెస్టుతో..కెప్టెన్ గా కొహ్లీ 50 మ్యాచ్ ల మైలురాయిని చేరనున్నాడు.

సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న 49 టెస్టుల రికార్డును అధిగమించి ..గతంలో ఇదే ఘనత సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ తర్వాతి స్థానంలో నిలువనున్నాడు.

2008 నుంచి 2014 మధ్యకాలంలో భారతజట్టు 60 టెస్టుల్లో ధోనీ నాయకత్వం అందించగా..2014 నుంచి ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్ వరకూ విరాట్ కొహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా 3వ ర్యాంకర్ సౌతాఫ్రికాతో జరుగుతున్న తీన్మార్ టెస్ట్ సిరీస్ తొలిమ్యాచ్ లో భారీవిజయం సాధించిన భారత్ 1-0 ఆధిక్యంతో పైచేయి సాధించింది

First Published:  9 Oct 2019 8:03 PM GMT
Next Story