Telugu Global
National

బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఖాతాదారులు

పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంకు కుంభకోణం అనేక పరిణామాలకు దారి తీస్తోంది. కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలపై ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ముంబైలోని నారియన్ పాయింట్‌ వద్ద ఉన్న బీజేపీ కార్యాలయాన్ని పీఎంసీ బ్యాంకు ఖాతాదారులు ముట్టడించారు. పీఎంసీ ఖాతాదారుల నగదు ఉపసంహరణపై ఆంక్షలు పెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. కేవలం 25వేల రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను […]

బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఖాతాదారులు
X

పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంకు కుంభకోణం అనేక పరిణామాలకు దారి తీస్తోంది. కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలపై ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ముంబైలోని నారియన్ పాయింట్‌ వద్ద ఉన్న బీజేపీ కార్యాలయాన్ని పీఎంసీ బ్యాంకు ఖాతాదారులు ముట్టడించారు. పీఎంసీ ఖాతాదారుల నగదు ఉపసంహరణపై ఆంక్షలు పెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.

కేవలం 25వేల రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను భిక్షగాళ్లను చేసిందని ఆవేదన చెందారు. 25వేలతో అవసరాలు ఎలా తీరుతాయని ప్రశ్నించారు.

బ్యాంకులు ఇలా తయారవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తమ కష్టార్జితాన్ని బ్యాంకులో దాచుకున్నామని… ఇప్పుడు ఆ సొమ్ము విత్‌డ్రాకు ఆంక్షలు పెట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు.

అధికారులు, ప్రభుత్వం ఏం చేస్తోందో అర్ధం కావడం లేదని మండిపడ్డారు. బ్యాంకులపై నమ్మకమే పోయిందన్నారు. అదే సమయంలో బీజేపీ కార్యాలయం వద్దకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రావడంతో ఒక దశలో ఉద్రిక్తత ఏర్పడింది. ఆమెకు వ్యతిరేకంగా బ్యాంకు ఖాతాదారులు పెద్దెత్తున నినాదాలు చేశారు.

First Published:  10 Oct 2019 6:29 AM GMT
Next Story