నాగచైతన్య సినిమా వాయిదా?

వరుస సినిమాలతో ఊపుమీదున్నాడు నాగచైతన్య. మజిలీ సక్సెస్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇదే ఊపులో శేఖర్ కమ్ముల సినిమాను కూడా పూర్తిచేయాలనుకున్నాడు. కానీ చైతూ వేగానికి బ్రేకులు పడ్డాయి. శేఖర్ కమ్ముల సినిమా వాయిదాపడింది. అవును.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య చేస్తున్న సినిమాను డిసెంబర్ నుంచి వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.

నెల రోజుల కిందట అఫీషియల్ గా ప్రారంభమైంది శేఖర్ కమ్ముల, నాగచైతన్య సినిమా. ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ స్వయంగా ప్రకటించారు. కానీ షూటింగ్ లో జాప్యం వల్ల సినిమా వాయిదా పడింది. కుదిరితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

నిజానికి కమ్ముల సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా షూటింగ్ పూర్తయింది. గతంలో కొత్త హీరోహీరోయిన్లతో కమ్ముల ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమానే ఇప్పుడు నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా మొదలుపెట్టాడు. మిగతా ఫూటేజ్ మొత్తం అలానే ఉంది. హీరోహీరోయిన్లపై సన్నివేశాలు తీస్తే సరిపోతుంది. కానీ ఇది కూడా నవంబర్ నాటికి పూర్తవ్వడం కష్టంగా మారింది. అందుకే సినిమాను వాయిదా వేస్తున్నారు.

ఇలా జరగడం నాగచైతన్యకు కూడా కాస్త కలిసొచ్చింది. ఎఁదుకంటే వెంకీమామ సినిమా అనుకోకుండా వాయిదాపడింది. ఈనెలలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా నవంబర్ కు, ఆ తర్వాత డిసెంబర్ కు వాయిదాపడింది. సో.. అదే నెలలో శేఖర్ కమ్ముల సినిమా కూడా వస్తే చైతూకు అది ఇబ్బందిగా మారేది. ఇప్పుడీ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో చైతూ సినిమాల మధ్య మినిమం గ్యాప్ వచ్చింది.