స్టూడెంట్ నెం.1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు….

వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు రాజమౌళి. ఈ రోజు రాజమౌళి పుట్టిన రోజు.  స్టూడెంట్ నంబర్ వన్ సినిమా తో దర్శకుడిగా అరంగేట్రం చేసి, అక్కడ నుంచి ఒక్కో సినిమా తో ఒక్కో మెట్టు ఎక్కుతూ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు రాజమౌళి.

తను ఏ సినిమా చేసినా, గత చిత్రాల తాలూకు వాసనలు రాకుండా జాగ్రత్త పడుతూ ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూ వచ్చారు.

రెండు భాగాల్లో బాహుబలి చిత్రాన్ని చేసి నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు. భారీ వసూళ్ళు రాబట్టాడు.

ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే సినిమా కి సంబందించిన షూటింగ్ వ్యవహారాల్లో బిజీ గా ఉన్నాడు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమా లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కి విడుదల కానుంది.