తాగుడుకు బానిసై అనారోగ్యం పాలయ్యా…

హీరోయిన్ శృతిహసన్‌ పలు ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె… తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. తాను తాగుడుకు బానిసైనట్టు చెప్పారు. అందువల్లే కొద్దికాలం సినిమాలకు కూడా దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. రెండేళ్లు పాటు విపరీతంగా విస్కీ తాగానని చెప్పారు.

విస్కీ బాటిల్‌కు బానిసనవడం వల్ల తీవ్ర అనారోగ్యం పాలయినట్టు చెప్పారామె. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని వివరించారు. ఆ సమయంలో సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం సినిమాలపై మాత్రమే తాను ఫోకస్ పెట్టినట్టు చెప్పారు.

తన బాయ్‌ ఫ్రెండ్ మైఖేల్‌ నుంచి విడిపోవడంపైనా ఆమె స్పందించారు. మైఖేల్‌తో బంధం ఒక మంచి అనుభవం అని వ్యాఖ్యానించారు. ఇద్దరం పరస్పరం చర్చించుకున్న తర్వాతనే విడిపోయామన్నారు.

తాను ఇప్పుడు ఒక గొప్ప ప్రేమికుడి కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. అలాంటి ప్రేమికుడు ఎదురైనప్పుడు ఆ విషయాన్ని అందరికీ చెబుతానన్నారు. తాను ప్రశాంతంగా ఉంటానని… చాలా అమాయకురాలిని అని చెప్పారు శృతి.