Telugu Global
NEWS

జిల్లా మనవడిగా చెబుతున్నా సమాంతర కాలువ తీసుకొస్తా... రూపురేఖలు మారుస్తా...

ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదిస్తే మరింత మంచిగా పాలన చేస్తానని అన్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. అనంతపురంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్‌ మోహన్ రెడ్డి… అనంతపురం జిల్లా గురించి పూర్తిగా అవగాహన తనకు ఉందన్నారు. అనంతపురం జిల్లాకు తాను మనవడిని అని చెప్పారు. తన తల్లి విజయమ్మ అనంతపురం జిల్లా ఆడపడుచు అని గుర్తు చేశారు. మనవడిగా అనంతపురం జిల్లా రూపురేఖలు మారుస్తామన్నారు. ప్రస్తుతం హంద్రీనీవా కెనాల్‌ 2200 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లలేకపోతోందని… ఇదే […]

జిల్లా మనవడిగా చెబుతున్నా సమాంతర కాలువ తీసుకొస్తా... రూపురేఖలు మారుస్తా...
X

ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదిస్తే మరింత మంచిగా పాలన చేస్తానని అన్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. అనంతపురంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్‌ మోహన్ రెడ్డి… అనంతపురం జిల్లా గురించి పూర్తిగా అవగాహన తనకు ఉందన్నారు.

అనంతపురం జిల్లాకు తాను మనవడిని అని చెప్పారు. తన తల్లి విజయమ్మ అనంతపురం జిల్లా ఆడపడుచు అని గుర్తు చేశారు. మనవడిగా అనంతపురం జిల్లా రూపురేఖలు మారుస్తామన్నారు.

ప్రస్తుతం హంద్రీనీవా కెనాల్‌ 2200 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లలేకపోతోందని… ఇదే కాలువ ద్వారా ఆరు వేల క్కూసెక్కుల నీరు తీసుకొచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. దానితో పాటు మరో సమాంతర కాలువ తవ్వి మరో నాలుగు వేల క్కూసెక్కుల నీటిని తీసుకొస్తామన్నారు. అనంతపురం జిల్లా సమస్యలు తెలిసిన వ్యక్తిగా చెబుతున్నానని… అన్ని రంగాల్లోనూ జిల్లాను ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

వైఎస్‌ పాలన తర్వాత పదేళ్లలో ఎప్పుడూ కూడా అనంతపురం జిల్లాలో చెరువులు నిండలేదని… కానీ దేవుడి దయ వల్ల ఈసారి జిల్లాలో చెరువులన్నీ నిండాయన్నారు. జిల్లా ప్రజల ఆశీస్సులు ఉంటే మరింత మంచిగా పాలన చేస్తానని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కోరారు.

రాష్ట్రంలో ఐదు కోట్ల 40 మంది జనాభా ఉంటే వారిలో రెండు కోట్ల 12 లక్షల మందికి కంటికి సంబంధించిన వివిధ సమస్యలున్నాయన్నారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే చూపు కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. 80 శాతం కంటి సమస్యలను కొద్దిగా శ్రద్ద తీసుకోవడం ద్వారా సరిచేసుకోవచ్చన్నారు.

అందుకే వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ ప్రజలందరికీ ఏమాత్రం కంటి సమస్యలు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పథకం తెచ్చినట్టు చెప్పారు. ఇందుకు 560 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు వివరించారు.

పరీక్షలు చేయించడమే కాకుండా ఉచితంగా ఆపరేషన్లు, కళ్లజోళ్లు ఇస్తామన్నారు. మొదటి రెండు దశల్లో పిల్లలందరికీ కంటి పరీక్షలు చేయించి అవసరం ఉన్న వారికి ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. నేటి నుంచి అక్టోబర్ 16 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తామన్నారు. ఆ తర్వాత అవసరం ఉన్న వారికి ఆపరేషన్ చేయడం, కళ్లజోడు ఇవ్వడం చేస్తామన్నారు.

108 అంబులెన్స్ వ్యవస్థను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. ప్రతి మండలానికి అంబులెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2022 జనవరి నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామన్నారు. నాడు-నేడు అని ఫఒటోలు తీసి చూపిస్తామన్నారు. వైద్యం, వ్యవసాయం, విద్యకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జగన్ చెప్పారు.

First Published:  10 Oct 2019 10:23 AM GMT
Next Story