Telugu Global
NEWS

ప్రపంచ మహిళా బాక్సింగ్ లో భారత్ కు 3 పతకాలు ఖాయం

సెమీఫైనల్లో మంజు, జమున, మేరీకోమ్ రష్యాలోని ఉలాన్ ఉడే వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీలలో భారత్ కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. వెటరన్ మేరీ కోమ్,యువబాక్సర్లు జమునా బోరో, మంజూ రాణీ తమతమ విభాగాలలో సెమీస్ కు అర్హత సాధించడం ద్వారా కనీసం కాంస్య పతకాలు ఖాయం చేయగలిగారు. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు అర్హతగా జరుగుతున్న ప్రస్తుత ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీల 48 కిలోల విభాగంలో మంజురాణి […]

ప్రపంచ మహిళా బాక్సింగ్ లో భారత్ కు 3 పతకాలు ఖాయం
X
  • సెమీఫైనల్లో మంజు, జమున, మేరీకోమ్

రష్యాలోని ఉలాన్ ఉడే వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీలలో భారత్ కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. వెటరన్ మేరీ కోమ్,యువబాక్సర్లు జమునా బోరో, మంజూ రాణీ తమతమ విభాగాలలో సెమీస్ కు అర్హత సాధించడం ద్వారా కనీసం కాంస్య పతకాలు ఖాయం చేయగలిగారు.

వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు అర్హతగా జరుగుతున్న ప్రస్తుత ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీల 48 కిలోల విభాగంలో మంజురాణి సంచలన విజయం సాధించింది.

క్వార్టర్ ఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన టాప్ సీడింగ్ బాక్సర్ కిమ్ హ్యంగ్ మీపై మంజు రాణి 4-1తో నెగ్గి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొంది. ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీఫైనల్లో థాయ్ లాండ్ బాక్సర్ చుటామట్ తో మంజు అమీతుమీ తేల్చుకోనుంది.

మంజు సెమీస్ లో సైతం నెగ్గితే ఫైనల్స్ చేరడం ద్వారా రజత, స్వర్ణ పతకాలలో ఏదో ఒకటి సొంతం చేసుకోగలుగుతుంది. అదే ఓడినా …కాంస్య పతకం అందుకోనుంది.

సెమీస్ లో జమునా బోరా…

మహిళల 54 కిలోల విభాగం క్వార్టర్ ఫైనల్లో జర్మనీ బాక్సర్ ఉర్సులాను 4-1తో జమునా బోరో కంగుతినిపించి సెమీస్ లో అడుగుపెట్టడం ద్వారా ఏదో ఒక పతకం సాధించే అవకాశాన్ని చేజిక్కించుకొంది.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ లో…టాప్ సీడ్ బాక్సర్ హువాంగ్ హసియోతో జమునా తలపడనుంది.

మేరీ కోమ్ మరో ప్రపంచ రికార్డు…

మహిళల 51 కిలోల విభాగంలో బంగారు వేట మొదలు పెట్టిన భారత వెటరన్ బాక్సర్ మేరీ కోమ్…అలవోకగా సెమీస్ బెర్త్ సంపాదించింది.

క్వార్టర్ ఫైనల్లో కొలంబియా బాక్సర్ వాలెన్షియాను 5-0తో చిత్తు చేయడం ద్వారా సెమీస్ చేరిన మేరీకోమ్…ఫైనల్లో చోటు కోసం జరిగే సమరంలో టర్కీకి చెందిన రెండోసీడ్ బాక్సర్ బాసునాజ్ కాక్ రోగ్యులూతో తలపడనుంది.

8వ పతకం ఖాయం…

తన కెరియర్ లో తొమ్మిదోసారి ప్రపంచ బాక్సింగ్ బరిలోకి దిగిన మేరీకోమ్ కు ఇప్పటికే ఆరు బంగారు పతకాలు సాధించిన అరుదైన రికార్డు ఉంది. ప్రస్తుత టోర్నీ సెమీస్ లో ఓడితే కాంస్యం… నెగ్గితే రజత లేదా స్వర్ణ పతకాలు సాధించే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రపంచ బాక్సింగ్ చరిత్రలోనే 8 పతకాలు సాధించిన తొలిమహిళగా మేరీకోమ్ చరిత్రలో నిలిచిపోనుంది.

వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు సన్నాహకంగా 51 కిలోల విభాగంలో తలపడుతున్న మేరీ కోమ్..7వసారి బంగారు పతకం నెగ్గితే అది సరికొత్త ప్రపంచ రికార్డుగా మిగిలిపోతుంది. 36 ఏళ్ల వయసులో ముగ్గురు బిడ్డల తల్లిగా మేరీ కోమ్ బాక్సింగ్ బరిలోకి దిగడం విశేషం.

First Published:  10 Oct 2019 6:57 PM GMT
Next Story