చిరు భేటీ వాయిదా, జగన్‌ ఢిల్లీ టూర్ రద్దు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో చిరంజీవి భేటీ వాయిదా పడింది. నేడు చిరంజీవి, రామ్‌చరణ్‌లు సీఎం జగన్‌ను కలవాల్సి ఉంది. వారిద్దరూ సీఎంను కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాను వీక్షించేందుకు ఆహ్వానించాల్సి ఉంది.

అయితే అనివార్య కారణాల వల్ల ఈ భేటీ సోమవారానికి వాయిదా పడింది. 14న చిరంజీవి, రామ్‌చరణ్‌లు జగన్‌ మోహన్ రెడ్డిని కలుస్తారు.

మరోవైపు జగన్‌ ఢిల్లీ టూర్‌ కూడా వాయిదా పడింది. శుక్రవారం జగన్‌ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కావాల్సి ఉండగా పర్యటన రద్దు చేశారు.

అమిత్ షా మహారాష్ట్ర వెళ్లాల్సి రావడంతో జగన్‌తో భేటీ వాయిదా పడింది. దాంతో ముఖ్యమంత్రి పర్యటన రద్దు అయినట్టు ఏపీ భవన్‌ ప్రకటించింది.

ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోడీని జగన్ కలిశారు. హోంమంత్రి ఆ రోజు అందుబాటులో లేకపోవడంతో కలవలేకపోయారు.