Telugu Global
National

టీడీపీ బుక్‌లెట్‌ గుట్టురట్టు చేసిన ఏపీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ఇటీవల టీడీపీ విడుదల చేసిన బుక్‌లెట్‌లోని అంశాల్లో వాస్తవాలు లేవని ఏపీ పోలీసులు ప్రకటించారు. టీడీపీ బుక్‌లెట్ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్‌… గుంటూరు రేంజ్ ఐజీ, గుంటూరు ఎస్పీతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. బుక్‌లెట్‌లో టీడీపీ చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. నాలుగు నెలల్లో 8 రాజకీయ హత్యలు జరిగినట్టు ఆరోపించారని.. కానీ ఒక్క రాజకీయ హత్య కూడా జరగలేదన్నారు. టీడీపీ చెప్పిన వివరాల […]

టీడీపీ బుక్‌లెట్‌ గుట్టురట్టు చేసిన ఏపీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ
X

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ఇటీవల టీడీపీ విడుదల చేసిన బుక్‌లెట్‌లోని అంశాల్లో వాస్తవాలు లేవని ఏపీ పోలీసులు ప్రకటించారు. టీడీపీ బుక్‌లెట్ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్‌… గుంటూరు రేంజ్ ఐజీ, గుంటూరు ఎస్పీతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

బుక్‌లెట్‌లో టీడీపీ చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. నాలుగు నెలల్లో 8 రాజకీయ హత్యలు జరిగినట్టు ఆరోపించారని.. కానీ ఒక్క రాజకీయ హత్య కూడా జరగలేదన్నారు. టీడీపీ చెప్పిన వివరాల ఆధారంగా తాము విచారణ చేశామని… వారు చెప్పిన వివరాల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. మరో నాలుగు హత్యలు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే గత ప్రభుత్వంలోనే జరిగాయన్నారు. మరో హత్య రౌడీ గ్రూపుల మధ్య వివాదం నేపథ్యంలో జరిగిందన్నారు.

పల్నాడులో ఒక్క హత్య కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగలేదని రవిశంకర్ స్పష్టం చేశారు. టీడీపీ బుక్‌లెట్‌లో ఆరోపించినట్టుగా ఒక్క రాజకీయ హత్య కూడా జరగలేదన్నారు.

కొత్త ప్రభుత్వం వచ్చాక రాజకీయ కారణాలతో 110 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని టీడీపీ ఆరోపించిందని… అది కూడా వాస్తవం కాదని రవిశంకర్ అయ్యనార్ వివరించారు. కేవలం 27 ఎఫ్‌ఐఆర్‌లు మాత్రమే నమోదు అయ్యాయన్నారు. అందులోనూ 10 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ ఎన్నికల నోటిఫికేషన్ సమయంలోనే నమోదు అయ్యాయని వెల్లడించారు. మరో 13 కేసుల్లో అటు వైసీపీ నుంచి , ఇటు టీడీపీ నుంచి కూడా బాధ్యులు ఉన్నారని వారిని అరెస్ట్ కూడా చేసినట్టు చెప్పారు.

38 ఫిర్యాదుల్లో అసలు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని టీడీపీ చేసిన ఆరోపణను కూడా పోలీసులు ఖండించారు. బుక్‌లెట్‌లో టీడీపీ ఇచ్చిన వ్యక్తుల పేర్లు, వారి ఫోన్ నెంబర్ల ఆధారంగా తాము విచారణ జరిపామని… అసలు తాము ఫిర్యాదులే ఇవ్వలేదని 33 మంది చెప్పారని వెల్లడించారు. కాబట్టి ఫిర్యాదులు తీసుకోలేదంటూ టీడీపీ చేసిన ఆరోపణ కూడా అవాస్తవమన్నారు.

ఆత్మకూరు మండలం నుంచి 545 మందిని గ్రామాల నుంచి తరిమేశారన్న టీడీపీ బుక్‌ లెట్‌ ఆరోపణ కూడా అవాస్తవమని వివరించారు. టీడీపీ ఇచ్చిన జాబితా ఆధారంగా విచారణ జరపగా వారిలో 79 మంది అసలు గ్రామమే వదిలి వెళ్లలేదన్నారు. మరో 340 మంది వివిధ కారణాలతో ఇతర చోట్లకు వెళ్లి తిరిగి వచ్చారన్నారు. మరో 33 మంది తాము భూములు కౌలు చేసుకుంటున్నందునే ఇతర ప్రాంతాలకు వచ్చినట్టు చెప్పారన్నారు.

కాబట్టి రాజకీయ కారణాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ప్రచారం చేయడం సరికాదని రాజకీయ పార్టీలకు రవిశంకర్ అయ్యనార్ సూచించారు. పోలీసులకు రాజకీయ రంగు అంటగట్టవద్దని కోరారు.

First Published:  12 Oct 2019 11:57 AM GMT
Next Story