Telugu Global
NEWS

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ సర్వే రిపోర్టు

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. ఎన్నికల ప్రచార సరళిపై పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన … హుజూర్‌నగర్‌పై అంతర్గత సర్వే నిర్వహించినట్టు చెప్పారు. టీఆర్‌ఎస్‌కు 50 శాతానికి పైగా ఓట్లు రాబోతున్నాయని నేతలకు వివరించారు. ప్రచార సరళి బాగుందని… దీన్ని మరింత పట్టుదలగా కొనసాగించాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే హుజూర్‌నగర్‌ అభివృద్ధి సాధ్యమన్న నినాదం బాగా పనిచేస్తోందన్నారు. గత ఎన్నికల్లో కూడా కారును పోలిన ట్రక్కు గుర్తు […]

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ సర్వే రిపోర్టు
X

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. ఎన్నికల ప్రచార సరళిపై పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన … హుజూర్‌నగర్‌పై అంతర్గత సర్వే నిర్వహించినట్టు చెప్పారు. టీఆర్‌ఎస్‌కు 50 శాతానికి పైగా ఓట్లు రాబోతున్నాయని నేతలకు వివరించారు. ప్రచార సరళి బాగుందని… దీన్ని మరింత పట్టుదలగా కొనసాగించాలని సూచించారు.

టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే హుజూర్‌నగర్‌ అభివృద్ధి సాధ్యమన్న నినాదం బాగా పనిచేస్తోందన్నారు. గత ఎన్నికల్లో కూడా కారును పోలిన ట్రక్కు గుర్తు వల్ల టీఆర్‌ఎస్‌ హుజూర్‌నగర్‌లో ఓడిపోయిందని… ఈసారి అలాంటి పరిస్థితి ఉండకూడదన్నారు. కారును పోలిక కొన్ని గుర్తులు ఈసారి కూడా ఉంటాయని… కాబట్టి కారు గుర్తుపై పూర్తి అవగాహన ప్రజలకు కలిగించేందుకు డమ్మీ ఈవీఎంలను ప్రచారంలో ఎక్కువగా ఉపయోగించాలని నేతలకు సూచించారు కేటీఆర్‌.

కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం ఓట్లు అడిగేందుకు అంశమే లేకుండా పోయిందన్నారు. కేంద్ర నిధులతో నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఉత్తమ్ చెబుతున్నారని… కానీ ప్రస్తుతం కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో లేదన్న విషయాన్ని ఆయన మరిచినట్టుగా ఉన్నారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఈ ఉప ఎన్నికతో బీజేపీ సంగతి కూడా తేలిపోతుందన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో వచ్చే బీజేపీ ఓట్ల శాతం బట్టి ఆ పార్టీ నేతలు ఇంతకాలం చెబుతున్న మాటలు ఉత్తి మాటలేనని తేలిపోతుందన్నారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్లు తెచ్చుకుంటే చాలని వ్యాఖ్యానించారు.

First Published:  12 Oct 2019 11:55 AM GMT
Next Story