Telugu Global
NEWS

చర్చల ప్రసక్తే లేదు... విలీనం మా విధానమే కాదు

సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చల ప్రసక్తే లేదన్నారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్. ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడుతున్న యూనియన్‌ నాయకులు…. మరి ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కొద్ది రోజుల్లోనే మరిన్ని బస్సులను తిప్పుతామన్నారు. తాత్కాలిక ఉద్యోగులను మరింత మందిని తీసుకుని బస్సులను బయటకు తెస్తామన్నారు. డ్రైవర్ల సమర్థతను పరీక్షించిన తర్వాతే వారికి బస్సులను అప్పగిస్తున్నట్టు చెప్పారు. 20 శాతం ఫిట్‌మెంట్ అడిగితే 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన […]

చర్చల ప్రసక్తే లేదు... విలీనం మా విధానమే కాదు
X

సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చల ప్రసక్తే లేదన్నారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్. ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడుతున్న యూనియన్‌ నాయకులు…. మరి ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

కొద్ది రోజుల్లోనే మరిన్ని బస్సులను తిప్పుతామన్నారు. తాత్కాలిక ఉద్యోగులను మరింత మందిని తీసుకుని బస్సులను బయటకు తెస్తామన్నారు. డ్రైవర్ల సమర్థతను పరీక్షించిన తర్వాతే వారికి బస్సులను అప్పగిస్తున్నట్టు చెప్పారు.

20 శాతం ఫిట్‌మెంట్ అడిగితే 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత ప్రభుత్వానికి ఉందన్నారు. ఆర్టీసీ బతకాలంటే లాభాల్లోకి రావాల్సిందేనన్నారు. 50 శాతం ఆర్టీసీ బస్సులు, 30 శాతం స్టేజ్ క్యారేజ్‌, 20 శాతం ప్రైవేట్ బస్సులను నడుపుతామని మంత్రి ప్రకటించారు. విభజన నాటిని టీఎస్‌ ఆర్టీసీకి వచ్చిన ఆస్తుల విలువ కేవలం రూ. 4వేల 416 కోట్లు మాత్రమేనన్నారు.

అక్టోబర్ 5న విధులకు హాజరైన వారిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్దమని… ఆర్టీసీ సంఘాలు ప్రజామోదాన్ని కోల్పోయాయన్నారు. ఒకవైపు రైల్వేను ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ నేతలు… తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తోందని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. కార్మికులు సమ్మెలో ఉన్నా ఆర్టీసీని సమర్ధవంతంగా నడుపుతున్నామని చెప్పారు.

బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయలేదని ప్రశ్నించారు. రోజుకు 8వేలకు పైగా బస్సులను ప్రభుత్వం ప్రస్తుతం నడుపుతోందన్నారు. ఆర్టీసీ బస్సులే రోజుకు ఐదువేల వరకు తిప్పుతున్నామన్నారు. ఎక్కడా టికెట్‌కు అధిక ధరను వసూలు చేయడం లేదన్నారు. అన్ని రకాల బస్సు పాసులను అనుమతి ఇస్తున్నట్టు మంత్రి చెప్పారు.

ఇకపై కార్మిక సంఘాలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. అక్టోబర్ 5 నాటికి విధులకు హాజరుకాని వారిని తాము ఆర్టీసీ ఉద్యోగులుగా, నాయకులుగా గుర్తించబోమన్నారు. చర్చలు జరిపేందుకు ఆర్టీసీ సంఘాల తరపున ప్రస్తుతం ఎవరూ లేరన్నారు.

ప్రస్తుతం ప్రజలకు ఇబ్బందులు లేకుండా రవాణా సదుపాయం కల్పించడం మాత్రమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పువ్వాడ చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని… అది టీఆర్ఎస్ ప్రభుత్వ విధానమే కాదని తేల్చిచెప్పారు.

First Published:  12 Oct 2019 7:57 AM GMT
Next Story