Telugu Global
Cinema & Entertainment

ఇక సైరా కథ ముగిసినట్టే

తెలుగురాష్ట్రాల్లో సైరాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. రేపోమాపో ఇది వంద కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోతుంది. మరి వరల్డ్ వైడ్ ఈ సినిమా పరిస్థితేంటి? భారీ బడ్జెట్ తో పాన్-ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో హిట్ అయిందా…. చిరంజీవి ఆశించిన నేషనల్ స్టార్ అనే ఇమేజ్ ను తీసుకొచ్చిందా? ఈ ప్రశ్నలకు మాత్రం కాదనే సమాధానం వస్తుంది. అవును.. సైరా ఇక్కడ మాత్రమే హిట్. ఇక్కడే హిట్ అయింది […]

ఇక సైరా కథ ముగిసినట్టే
X

తెలుగురాష్ట్రాల్లో సైరాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. రేపోమాపో ఇది వంద కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోతుంది. మరి వరల్డ్ వైడ్ ఈ సినిమా పరిస్థితేంటి? భారీ బడ్జెట్ తో పాన్-ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో హిట్ అయిందా…. చిరంజీవి ఆశించిన నేషనల్ స్టార్ అనే ఇమేజ్ ను తీసుకొచ్చిందా? ఈ ప్రశ్నలకు మాత్రం కాదనే సమాధానం వస్తుంది.

అవును.. సైరా ఇక్కడ మాత్రమే హిట్. ఇక్కడే హిట్ అయింది ఈ సినిమా. మిగతా అన్ని చోట్లా ఫ్లాప్ అయింది. మరీ ముఖ్యంగా ఉత్తరాదిన ఈ సినిమాకు ఘోర పరాభవం తప్పలేదు. ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థపై ఫర్హాన్ అక్తర, తడానీ సంయుక్తంగా ఈ సినిమాను ఉత్తరాదిన విడుదల చేశారు. వాళ్ల అంచనాల్ని ఈ సినిమా ఏమాత్రం అందుకోలేకపోయింది. నిన్నటితో 10 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ఉత్తరాదిన కేవలం 7 కోట్ల రూపాయల నెట్ మాత్రమే వచ్చింది. ఇక్కడ కూడా మరో మెలిక ఉంది. ఈ 7 కోట్లలో 2 కోట్ల రూపాయలు కేవలం ఉత్తరాదిన రిలీజైన తెలుగు వెర్షన్ కు వచ్చింది. అంటే, అక్కడ కూడా మన తెలుగు వాళ్లు చూడడం వల్ల ఆమాత్రమైనా గట్టెక్కింది సైరా సినిమా.

ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాకు ఉత్తరాదిన ఘోర పరాభవం తప్పలేదు. అటుఇటుగా నార్త్ లో 80 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాకు కేవలం 7 కోట్ల రూపాయలు రావడం ఘోర అవమానం. ఫైనల్ రన్ లో మరో కోటి రూపాయలు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది.

First Published:  12 Oct 2019 8:13 AM GMT
Next Story