Telugu Global
NEWS

దసరా సెలవులు 19 వరకు పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను పొడిగించింది. ఈనెల 19 వరకు విద్యాసంస్థలకు సెలవులను పొడిగించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉన్న వారిని పనిలోకి తీసుకోవాలని… వారితో బస్సులు నడపాలని ఆదేశించారు. సమ్మె చేస్తున్న వారితో చర్చల ప్రసక్తే లేదన్నారు సీఎం. ఇప్పుడు వచ్చినా వారిని ఉద్యోగంలోకి తీసుకునే ప్రసక్తే […]

దసరా సెలవులు 19 వరకు పొడిగింపు
X

తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను పొడిగించింది. ఈనెల 19 వరకు విద్యాసంస్థలకు సెలవులను పొడిగించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉన్న వారిని పనిలోకి తీసుకోవాలని… వారితో బస్సులు నడపాలని ఆదేశించారు. సమ్మె చేస్తున్న వారితో చర్చల ప్రసక్తే లేదన్నారు సీఎం. ఇప్పుడు వచ్చినా వారిని ఉద్యోగంలోకి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. విధుల్లో ఉన్న వారికి మాత్రమే సెప్టెంబర్‌ జీతాలు చెల్లించాలని సీఎం ఆదేశించారు. 48వేల మంది కార్మికులు వారికి వారుగానే ఉద్యోగాలు మానేసి వెళ్లినట్టు గుర్తిస్తున్నట్టు చెప్పారు.

ఈనెల 21 నుంచి అన్ని బస్సులు తిరిగాల్సిందేనని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ డిపోల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని డీజీపీకి సూచనలు చేశారు కేసీఆర్. డిపోల వద్ద సీసీ కెమెరాలను తక్షణం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కొత్తగా ఆర్టీసీలో నియామకాలకు సంబంధించి పాటించాల్సిన నియమ నిబంధనల పైనా సమావేశంలో చర్చించారు. దసరా సెలవులను 19 వరకు పొడిగించినందున సిలబస్ పూర్తికి ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది రెండో శనివారాల సెలవులను రద్దు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

First Published:  12 Oct 2019 7:47 AM GMT
Next Story