Telugu Global
National

విమానంలోనే కపిల్‌కు బాబు అమరావతి పాఠాలు

దేనినైనా తన ఖ్యాతిని పెంచేలా ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరు అన్నది చాలా మంది చెప్పేదే. ఈ మధ్య అయితే నమ్మడం లేదు గానీ… అప్పట్లో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టింది చంద్రబాబే, హైదరాబాద్‌కు ఐటీని తెచ్చింది చంద్రబాబే అంటూ జరిగిన ప్రచారాన్ని చదువుకున్న ఐటీ పిల్లలు కూడా నమ్మేసిన ఉదంతాలున్నాయి. ఆయన ప్రచార పఠిమ అలాంటిది మరి. మాజీ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇటీవల చంద్రబాబుకు స్పెషల్ ఫ్లైట్ లేదు. కాబట్టి ఆయన […]

విమానంలోనే కపిల్‌కు బాబు అమరావతి పాఠాలు
X

దేనినైనా తన ఖ్యాతిని పెంచేలా ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరు అన్నది చాలా మంది చెప్పేదే. ఈ మధ్య అయితే నమ్మడం లేదు గానీ… అప్పట్లో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టింది చంద్రబాబే, హైదరాబాద్‌కు ఐటీని తెచ్చింది చంద్రబాబే అంటూ జరిగిన ప్రచారాన్ని చదువుకున్న ఐటీ పిల్లలు కూడా నమ్మేసిన ఉదంతాలున్నాయి. ఆయన ప్రచార పఠిమ అలాంటిది మరి.

మాజీ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇటీవల చంద్రబాబుకు స్పెషల్ ఫ్లైట్ లేదు. కాబట్టి ఆయన సాధారణ విమానాల్లోనే తిరుగుతున్నారు. ఈ సమయంలో సహజంగానే పలువురు వీఐపీలు కూడా విమానం ఎక్కుతారు. ఇలా ఇటీవల కపిల్ దేవ్‌ ఎక్కారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు వస్తున్న విమానంలోనే మాజీ క్రికెటర్‌ కపిల్ దేవ్‌ ఎక్కారు.

దాన్ని గమనించిన చంద్రబాబు ఆయనతో ముచ్చట్లు పెట్టారు. అమరావతి ముచ్చట్లు వివరించారట. తాను ముఖ్యమంత్రిగా దిగిపోవడం వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరుగుతోందని కపిల్‌ బుర్రలోకి నూరిపోసే ప్రయత్నం చేశారు.

చంద్రబాబు చెబుతున్న మాటలకు కపిల్‌ దేవ్‌… ”ఇవన్నీ ఈయన నాకెందుకు చెబుతున్నారబ్బా !” అన్నట్టుగా యా… యా అంటూ ఊకొడుతూ కూర్చున్నారు.

కపిల్‌దేవ్‌కు చంద్రబాబు పాఠాలు చెబుతున్న దృశ్యాలను ముందు సీట్లో ఉన్న బాబు సిబ్బంది రికార్డు చేశారు. దాన్ని మీడియాకు అందజేశారు. అంతే టీడీపీ అనుకూల టీవీ చానళ్లు.. కపిల్ దేవ్ కు అమరావతి రాజధాని గొప్పతనాన్ని చంద్రబాబు వివరించారంటూ ప్రసారం చేశాయి.

కాకపోతే నెటిజన్లు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. కపిల్‌కు కథలు కథలుగా చెప్పేంతగా చంద్రబాబు చెబుతున్న అమరావతిలో ఏముందబ్బా అని జోకులేస్తున్నారు. ముంపు ప్రాంతంలోనూ వంద అడుగుల మేర పునాదులు తీసి కట్టిన తాత్కాలిక భవనాల గురించి చెప్పారా?. లేక వర్షం వస్తే జలమయమయ్యే హైకోర్టు భవనం గురించి వివరించారా?. మూడు పంటలు పండే భూములను నాశనం చేసిన పనిని వివరించారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

First Published:  12 Oct 2019 9:11 PM GMT
Next Story