నాని సినిమా అప్ డేట్స్

తన 25వ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు నాని. ఎందుకంటే కెరీర్ లో ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ ను అందులో పోషిస్తున్నాడు. అవును.. ‘V’ అనే సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు నాని. మరో హీరోగా సుధీర్ బాబు నటిస్తున్నాడు. మొన్నటివరకు హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. నెక్ట్స్ షెడ్యూల్ ను మనాలీలో ప్లాన్ చేశారు.

కథ ప్రకారం, ఓ డిఫరెంట్ లొకేషన్ కావాల్సి వచ్చింది దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు. అందుకే చాలా ప్రాంతాలు పరిశీలించి ఫైనల్ గా మనాలీని ఫిక్స్ చేశాడు. ఇటు నాని, అటు సుధీర్ బాబుతో ఎలాగూ డేట్స్ సర్దుబాటు సమస్య లేదు కాబట్టి, వీలైనంత తొందర్లోనే మనాలీలో కీలకమైన షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో అదితిరావు హైదరి, నివేత థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త నానిని చూస్తానంటున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. సినిమాలో చాలా సన్నివేశాల్లో నాని, మేకప్ లేకుండా కనిపిస్తాడట.