దేశవాళీ వన్డే క్రికెట్లో సంజు శాంసన్ సరికొత్త రికార్డు

  • 129 బాల్స్ లో 212 పరుగులతో సంజు నాటౌట్
  • విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఫాస్టెస్ట్ డబుల్

దేశవాళీ వన్డే క్రికెట్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. 50 ఓవర్ల మ్యాచ్ లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

గోవా ప్రత్యర్థిగా ముగిసిన మ్యాచ్ లో సంజు శాంసన్ చెలరేగిపోయాడు. రెండో వికెట్ కు సచిన్ బేబీతో కలసి ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు.

సంజు కేవలం 129 బాల్స్ లోనే 10 సిక్సర్లు, 21 బౌండ్రీలతో 212 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు.
సంజు-సచిన్ కలసి 338 పరుగుల భాగస్వామ్యం సాధించడంతో…కేరళ 50 ఓవర్లలో 377 పరుగుల భారీస్కోరు సాధించింది.

శిఖర్ ధావన్ ఓ ప్రాక్టీస్ మ్యాచ్ లో సాధించిన ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డును సంజు శాంసన్ తెరమరుగు చేశాడు. భారత సీనియర్ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న సంజు శాంసన్ కెరియర్ లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.