ఎస్వీబీసీ డైరెక్టర్లుగా శ్రీనివాస్‌ రెడ్డి, స్వప్న

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) డైరెక్టర్లను ఏపీ ప్రభుత్వం నియమించింది. సినీ రంగానికి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ స్వప్నలను ఎస్వీబీసీ డైరెక్టర్లుగా నియమించారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉన్న పృథ్వీరాజ్‌ తో కలిసి వీరు పనిచేస్తారు.

ఇప్పటి వరకు టీటీడీ బోర్డులోని సభ్యులను డైరెక్టర్లుగా నియమించేవారు. ఈసారి మాత్రం స్వప్న, శ్రీనివాసరెడ్డిని డైరెక్టర్లుగా నియమించారు. సీనియర్ జర్నలిస్ట్ స్వప్న ప్రస్తుతం 10టీవీలో పనిచేస్తున్నారు. ఈమెకు గాయనిగా కూడా పేరుంది.