సౌతాఫ్రికాను ఫాలోఆన్ చేసిన తొలి కెప్టెన్ విరాట్ కొహ్లీ

  • విరాట్ కెప్టెన్ గా 14 టెస్టుల్లో ఫాలోఆన్ స్థితిలో భారత్
  • ఏడుసార్లు మాత్రమే ఫాలోఆన్ కోరిన విరాట్

టెస్ట్ క్రికెట్ మూడో ర్యాంకర్ సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడించిన భారత తొలి కెప్టెన్ ఘనతను విరాట్ కొహ్లీ సొంతం చేసుకొన్నాడు. పూణే టెస్టు తొలిఇన్నింగ్స్ లో సఫారీలను 275 పరుగులకే ఆలౌట్ చేయడం ద్వారా భారతజట్టు ఫాలోఆన్ ఉచ్చులోకి నెట్టింది.

326 పరుగుల ఆధిక్యంతో…327 పరుగుల టార్గెట్ తో సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడాలని విరాట్ కోరాడు. అంతేకాదు…కెప్టెన్ గా భారత్ కు 30వ విజయాన్ని ఖాయం చేశాడు.

ఇప్పటి వరకూ భారతజట్టుకు 50సార్లు టెస్టుల్లో నాయకత్వం వహించిన కొహ్లీకి జట్టు సారథిగా 14సార్లు ప్రత్యర్థిజట్లను ఫాలోఆన్ కు గురిచేసేన అవకాశం వచ్చింది.

అయితే…ప్రస్తుత పూణే టెస్టుతో కలుపుకొని ఏడుసార్లు మాత్రమే ప్రత్యర్థిజట్లను కొహ్లీ…ఫాలోఆన్ ఆడించాడు.

ఫాలోఆన్ ఆడించిన మొత్తం 7 మ్యాచ్ ల్లో భారత్ 5 విజయాలు సాధించగా…రెండుమ్యాచ్ లు వానదెబ్బతో డ్రాగా ముగియక తప్పలేదు.