Telugu Global
Cinema & Entertainment

అల్లు వారింట ఆస్తుల పంప‌కాలు !

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో అల్లు అర‌వింద్‌ బిగ్ ప్రొడ్యూస‌ర్‌. మంచి నిర్మాతే కాదు…. తెలివైన వ్యాపార‌వేత్త‌. ఈమ‌ధ్య‌నే 70వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నాడు. ఈ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అల్లు అర‌వింద్ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడట‌. అల్లు అర‌వింద్ త‌న ఆస్తుల పంప‌కం చేసినట్లు స‌మాచారం. ఇదే స‌రైన స‌మ‌యం అని..ఈ టైమ్‌లోనే ఆస్తుల పంప‌కాలు చేయాల‌ని నిర్ణ‌యించాడట‌. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ కు అల్లు అర‌వింద్ నిర్మాత‌. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ 2ను అల్లు అర్జున్ […]

అల్లు వారింట ఆస్తుల పంప‌కాలు !
X

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో అల్లు అర‌వింద్‌ బిగ్ ప్రొడ్యూస‌ర్‌. మంచి నిర్మాతే కాదు…. తెలివైన వ్యాపార‌వేత్త‌. ఈమ‌ధ్య‌నే 70వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నాడు. ఈ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అల్లు అర‌వింద్ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడట‌.

అల్లు అర‌వింద్ త‌న ఆస్తుల పంప‌కం చేసినట్లు స‌మాచారం. ఇదే స‌రైన స‌మ‌యం అని..ఈ టైమ్‌లోనే ఆస్తుల పంప‌కాలు చేయాల‌ని నిర్ణ‌యించాడట‌. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ కు అల్లు అర‌వింద్ నిర్మాత‌. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ 2ను అల్లు అర్జున్ చూస్తున్నాడు. రెండో బ్యాన‌ర్‌ను అర్జున్‌కే ఇచ్చాడని తెలుస్తోంది.

ఈ మ‌ధ్య ఆస్తుల పంపకం పూర్తి కావ‌డంతో అర్జున్ త‌న కుటుంబంతో క‌లిసి కొత్త ఇంటికి భూమి పూజ చేశాడు. ఇటీవ‌లే పెద్ద కొడుకు వెంక‌టేష్ పెళ్లి కూడా జ‌రిగింది. దీంతో ఇంటితో పాటు ఇత‌ర ఆస్తుల పంప‌కాలు పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. త‌న‌తో పాటు చిన్న కొడుకు ఓ ఇంట్లో ఉంటాడని.. ఇద్ద‌రు పెద్ద కొడుకులకు వేర్వేరు ఇళ్లు క‌ట్టించి ఇస్తాడని అంటున్నారు.

గీతాఆర్ట్స్ లాభాల‌ను సోద‌రి వ‌సంత‌తో పాటు పెద్ద, చిన్న కొడుకులు వెంక‌టేష్‌, శిరీష్‌ల మ‌ధ్య పంచిన‌ట్లు స‌మాచారం. గీతాఆర్ట్స్ డిజిట‌ల్ రైట్స్‌ను వెంక‌టేష్‌కు అప్ప‌గించాడట‌. గీతాఆర్ట్స్ వ్య‌వ‌హారాల‌ను శిరీష్‌కు అప్ప‌గించాల‌ని చూస్తున్నాడట‌. రెండో ప్రొడ‌క్ష‌న్ హౌస్ అర్జున్ త‌ర‌పున బ‌న్నీ వాసు ప‌ర్య‌వేక్షిస్తున్నాడు. మొత్తానికి అల్లువారింట ఆస్తుల పంప‌కాలు పూర్త‌య్యాయ‌ని తెలుస్తోంది.

First Published:  14 Oct 2019 1:11 AM GMT
Next Story