Telugu Global
NEWS

ఉద్రిక్తతల నడుమ శ్రీనివాసరెడ్డి అంత్యక్రియలు

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శ్రీనివాసరెడ్డి అంత్యక్రియలు ఆదివారం రాత్రి ఖమ్మంలో నిర్వహించారు. హైదరాబాద్ డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడంతో అక్కడే ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని ఖమ్మంలోని ఆయన స్వగృహానికి తరలించారు. కాగా… కుటుంబ సభ్యులు, బంధువులు.. తోటి కార్మికుల సందర్శనార్థం సోమవారం ఉంచి అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. కాని పోలీసులు కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వచ్చారు. […]

ఉద్రిక్తతల నడుమ శ్రీనివాసరెడ్డి అంత్యక్రియలు
X

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శ్రీనివాసరెడ్డి అంత్యక్రియలు ఆదివారం రాత్రి ఖమ్మంలో నిర్వహించారు. హైదరాబాద్ డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడంతో అక్కడే ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని ఖమ్మంలోని ఆయన స్వగృహానికి తరలించారు.

కాగా… కుటుంబ సభ్యులు, బంధువులు.. తోటి కార్మికుల సందర్శనార్థం సోమవారం ఉంచి అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. కాని పోలీసులు కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వచ్చారు. మృతదేహం ఇక్కడే ఉంటే శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని.. సోమవారం ఖమ్మం బంద్ ఉండటంతో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పి అప్పటికప్పుడు అంత్యక్రియలు చేయడానికి ఒప్పించారు.

రాపర్తినగర్‌లోని శ్రీనివాసరెడ్డి ఇంటి నుంచి అంతిమ యాత్రను ప్రారంభించారు. కాగా యాత్ర బైపాస్ రోడ్డుకు చేరుకోగానే కాల్వొడ్డు వైపునకు మళ్లించడానికి పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల ప్రతిపాదనకు కార్మిక సంఘ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఖమ్మం డిపో మీదుగా తీసుకొని వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు యాత్రను డిపో మీదుగా కాల్వొడ్డులోని శ్మశాన వాటికకు తరలించారు. అనంతరం అర్థరాత్రి అంత్యక్రియలు ముగిశాయి.

కాగా, తండ్రిని కాపాడుకునే క్రమంలో శ్రీనివాస రెడ్డి కొడుకు చేతులకు, ముఖానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అంతిమయాత్రలో అతడి పరిస్థితి చూసి పలువురు కంటతడిపెట్టారు.

First Published:  14 Oct 2019 12:29 AM GMT
Next Story