Telugu Global
Cinema & Entertainment

మరో ఫ్లాప్ పడింది... డైలమాలో గోపీచంద్

చాణక్య సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని భావించాడు గోపీచంద్. ఎందుకంటే ఇదొక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. దీనికి తోడు రొమాన్స్ కూడా ఉంది. కాబట్టి ఆడుతుందని భావించాడు. కానీ నాసిరకమైన సన్నివేశాలు, చెత్త స్క్రీన్ ప్లే కారణంగా చాణక్య ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ తో గోపీచంద్ ఇప్పుడు మరింత డైలమాలో పడ్డాడు. మరీ ముఖ్యంగా తన మార్కెట్ ఏంటో తెలుసుకున్నాడు. కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా గౌతమ్ నంద సినిమా చేశాడు గోపీచంద్. […]

మరో ఫ్లాప్ పడింది... డైలమాలో గోపీచంద్
X

చాణక్య సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని భావించాడు గోపీచంద్. ఎందుకంటే ఇదొక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. దీనికి తోడు రొమాన్స్ కూడా ఉంది. కాబట్టి ఆడుతుందని భావించాడు. కానీ నాసిరకమైన సన్నివేశాలు, చెత్త స్క్రీన్ ప్లే కారణంగా చాణక్య ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ తో గోపీచంద్ ఇప్పుడు మరింత డైలమాలో పడ్డాడు. మరీ ముఖ్యంగా తన మార్కెట్ ఏంటో తెలుసుకున్నాడు.

కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా గౌతమ్ నంద సినిమా చేశాడు గోపీచంద్. అది కాస్తా ఫ్లాప్ అయి భారీ నష్టాలు మిగిల్చింది. ఇప్పుడు అంతకంటే భారీ బడ్జెట్ తో చాణక్య సినిమా చేశాడు. ఇది కూడా ఫ్లాప్ అవ్వడంతో గోపీచంద్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో కథల కంటే ముందు బడ్జెట్ ను నియంత్రణలో పెట్టాలని నిర్ణయించుకున్నాడు హీరో. ఇందులో భాగంగా సంపత్ నంది దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను పెండింగ్ లో పెట్టాడట.

స్పోర్ట్స్ బేస్డ్ కథతో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు సంపత్ నంది. గోపీచంద్, తమన్న ఇందులో హీరోహీరోయిన్లు. ఈ సినిమా బడ్జెట్, గోపీచంద్ మార్కెట్ ను దాటిపోతోంది. ముందు ఒప్పుకున్న గోపీచంద్, చాణక్య రిజల్ట్ చూసిన తర్వాత ఆ సినిమాను పక్కనపెట్టాలని అనుకుంటున్నాడట. మరీ ముఖ్యంగా కథలో కూడా మార్పుచేర్పులు చేయాలని భావిస్తున్నాడట. అసలు దీనికంటే ముందు మరో దర్శకుడు ఎవరైనా సంప్రదిస్తే, సంపత్ నంది సినిమాను పూర్తిగా పక్కనపెట్టే ఆలోచనలో కూడా ఉన్నాడట.

First Published:  13 Oct 2019 11:08 PM GMT
Next Story