Telugu Global
NEWS

3 రోజులు గ్రేట‌ర్‌లో నీళ్లు బంద్ !

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మూడు రోజుల పాటు నీటి స‌ర‌ఫ‌రా నిలిచిపోనుంది. ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు నీటి స‌ర‌ఫ‌రా బంద్ చేస్తున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు తెలిపారు. గోదావరి జలాల సరఫరాలో అంతరాయంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ఫ్యాకేజీ-13లో భాగంగా…. గ్రావిటీ కెనాల్‌ నిర్మాణం జరుగుతుంది. గజ్వేల్‌ మండల పరిధిలోని కోడకండ్ల గ్రామం వద్ద నగరానికి వచ్చే గోదావరి 3000 ఎంఎం డయా ఎంఎస్‌ పైపులైన్‌ ఈ కెనాల్‌ నిర్మాణానికి అడ్డుగా […]

3 రోజులు గ్రేట‌ర్‌లో నీళ్లు బంద్ !
X

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మూడు రోజుల పాటు నీటి స‌ర‌ఫ‌రా నిలిచిపోనుంది. ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు నీటి స‌ర‌ఫ‌రా బంద్ చేస్తున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు తెలిపారు. గోదావరి జలాల సరఫరాలో అంతరాయంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ఫ్యాకేజీ-13లో భాగంగా…. గ్రావిటీ కెనాల్‌ నిర్మాణం జరుగుతుంది. గజ్వేల్‌ మండల పరిధిలోని కోడకండ్ల గ్రామం వద్ద నగరానికి వచ్చే గోదావరి 3000 ఎంఎం డయా ఎంఎస్‌ పైపులైన్‌ ఈ కెనాల్‌ నిర్మాణానికి అడ్డుగా ఉంది.

దీంతో ఈ భారీ పైపులైన్‌ వేరో చోటికి మారుస్తున్న క్రమంలో ఇరిగేషన్‌ శాఖ విజ్ఞప్తి మేరకు జలమండలి అధికారులు మూడు రోజుల పాటు షట్‌డౌన్ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది.

అంత‌రాయం క‌లిగే ప్రాంతాలు :

ఎర్రగడ్డ, బోరబండ, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్‌గూడ, ఎస్‌ఆర్‌ నగర్‌, ఆమీర్‌పేట, బంజారాహిల్స్‌, సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట, బాలా నగర్‌, భాగ్య నగర్‌, భరత్‌ నగర్‌, సనత్‌ నగర్‌, బోరబండ రిజర్వాయర్‌ పరిధి, చింతల్‌, జీడిమెట్ల, షాపూర్‌ నగర్‌, సూరారం, జగద్గీరిగుట్ట, కుత్భుల్లాపూర్‌, పేట్‌ బషీరాబాద్‌, ఢిఫెన్స్‌ కాలనీ, గౌతం నగర్‌, ప్రశాంత్‌ నగర్‌, చాణక్యపురి , మల్కాజ్‌గిరి, ఫతర్‌బాలాయి నగర్‌, అల్వాల్‌, న్యూ ఓయూటీ కాలనీ, కైలాసగిరి, హఫీజ్‌పేట, మియాపూర్‌, మాతృశ్రీ నగర్‌, మయూరి నగర్‌, చందా నగర్‌, ఆర్‌సి పురం, పటాన్‌చెరు, బోలారం, మయూరి నగర్‌, నిజాంపేట, ప్రగతి నగర్‌, బాచుపల్లి, బోల్లారం, ఆమీన్‌పూర్‌, మల్లంపేట, జవహర్‌ నగర్‌, బాలాజీ నగర్‌, కీసర, దమ్మాయిగూడ, నాగారం, చేర్యాల్‌, ఆర్‌జికే, అహ్మద్‌గూడ, దేవరాయాంజల్‌, తూంకుంట, ఎన్‌ఎఫ్‌సి, పోచారం, సింగాపూర్‌ టౌన్‌షిప్‌, మౌలాలీ, లాలాపేట, తార్నాక, సీఆర్‌పిఎఫ్‌, మెస్‌, కంటోన్మెంట్‌ బోర్డు పరిధి, తుర్కపల్లి బయోటెక్‌ పార్కు ప్రాంతాలలో నీటి సరఫరా ఉండదు.

First Published:  13 Oct 2019 7:00 PM GMT
Next Story