Telugu Global
NEWS

జేసీ దివాకర్ రెడ్డికి డ్రైవర్ షాక్ ఇచ్చాడు....

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని కారు డ్రైవర్ బురిడీ కొట్టించాడు. ఆయన సూట్ కేసులోని డబ్బును కొట్టేశాడు. జేసీ దివాకర్ రెడ్డి ఈనెల 11న హైదరాబాద్ నుంచి గన్నవరం  విమానంలో  వచ్చారు. అక్కడి నుంచి తన స్నేహితుడు త్యాగరాజు పంపిన కారులో గాంధీనగర్ లోని ఐలాపురం హోటల్ కు చేరుకున్నారు. అదే కారులో మళ్లీ సచివాలయానికి వెళ్లారు. అయితే అక్కడ పాస్ పోర్టు సైజు ఫొటోలు అవసరం కావడంతో తన పీఏను పిలిచి కారులో ఉన్న సూట్ […]

జేసీ దివాకర్ రెడ్డికి డ్రైవర్ షాక్ ఇచ్చాడు....
X

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని కారు డ్రైవర్ బురిడీ కొట్టించాడు. ఆయన సూట్ కేసులోని డబ్బును కొట్టేశాడు. జేసీ దివాకర్ రెడ్డి ఈనెల 11న హైదరాబాద్ నుంచి గన్నవరం విమానంలో వచ్చారు. అక్కడి నుంచి తన స్నేహితుడు త్యాగరాజు పంపిన కారులో గాంధీనగర్ లోని ఐలాపురం హోటల్ కు చేరుకున్నారు. అదే కారులో మళ్లీ సచివాలయానికి వెళ్లారు.

అయితే అక్కడ పాస్ పోర్టు సైజు ఫొటోలు అవసరం కావడంతో తన పీఏను పిలిచి కారులో ఉన్న సూట్ కేసులో ఫొటోలు ఉన్నాయని… వాటిని తెమ్మన్నాడు. ఫొటోలు తీసుకున్న పీఏ దానికి తాళం వేయడం మరిచిపోయాడు.

జేసీ ఆ పని పూర్తయ్యాక కారులో తిరిగి ఐలాపురం హోటల్ కు చేరుకున్నారు. సూట్ కేసును కారులోనే మర్చిపోవడంతో రూమ్ కు వెళ్లి పడుకున్నాడు.. తర్వాత సూట్ కేసు కారులో ఉందని డ్రైవర్ ను తెమ్మన్నాడు. డ్రైవర్ తెరిచి చూడగా అందులో రూ.2వేల నోట్ల కట్టలు మూడు కనిపించాయి. వాటిని కాజేసిన డ్రైవర్ ఖాళీ సూట్ కేసును జేసీకి ఇచ్చాడు.

అయితే సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే జేసీకి అందులో డబ్బు కనిపించలేదు. డ్రైవర్ ను అడిగినా తెలియదన్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు డ్రైవర్ ను తమదైన శైలిలో విచారించగా తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేశాడు. డ్రైవర్ గౌతమ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇలా జేసీకే టోకరా ఇచ్చాడు డ్రైవర్.

First Published:  14 Oct 2019 12:39 AM GMT
Next Story