Telugu Global
NEWS

రేపటి నుంచే రైతు భరోసా పథకం.... చంద్రబాబు సహించలేకపోతున్నాడు

సీఎం జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హమీలలో భాగంగా జగన్‌ రేపు నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ రైతుభరోసా పథకాన్ని ప్రారంభించబోతున్నారన్నారు. రైతులకు మంచి జరుగుతుంటే చంద్రబాబు సహించలేకపోతున్నాడని మండిపడ్డారు. ఏదో రకంగా సీఎం జగన్‌పై బురదజల్లాలని చూస్తున్నాడన్నారు. రేపు వైఎస్‌ఆర్‌ రైతుభరోసా పథకాన్ని నెల్లూరులో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభిస్తారని… పెట్టుబడి సాయంగా రైతులకే కాకుండా కౌలు రైతులకు సైతం 12,500 రూపాయలు ఇవ్వనున్నారని […]

రేపటి నుంచే రైతు భరోసా పథకం.... చంద్రబాబు సహించలేకపోతున్నాడు
X

సీఎం జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి.

ఎన్నికల్లో ఇచ్చిన హమీలలో భాగంగా జగన్‌ రేపు నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ రైతుభరోసా పథకాన్ని ప్రారంభించబోతున్నారన్నారు.

రైతులకు మంచి జరుగుతుంటే చంద్రబాబు సహించలేకపోతున్నాడని మండిపడ్డారు. ఏదో రకంగా సీఎం జగన్‌పై బురదజల్లాలని చూస్తున్నాడన్నారు.

రేపు వైఎస్‌ఆర్‌ రైతుభరోసా పథకాన్ని నెల్లూరులో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభిస్తారని… పెట్టుబడి సాయంగా రైతులకే కాకుండా కౌలు రైతులకు సైతం 12,500 రూపాయలు ఇవ్వనున్నారని చెప్పారు కాకాణి.

కృష్ణా జిల్లాలో మూడున్నరలక్షల మందికి పైగా రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరబోతోందన్నారు. ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపచేయడమే ఈ ప్రభుత్వ ప్రత్యేకత అని గుర్తు చేశారు కాకాణి. దీనిపై రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

ముఖ్యంగా లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కౌలు రైతులకు ఈ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం మేలుచేస్తుందన్నారు కాకాణి.

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కరువు తాండవించిందని… కానీ ఇప్పుడు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయన్నారు కాకాణి.

First Published:  14 Oct 2019 1:51 AM GMT
Next Story