Telugu Global
NEWS

అత్యధిక టెస్ట్ విజయాల కెప్టెన్ విరాట్

50 టెస్టుల్లో 30 విజయాలతో కొహ్లీ జోరు టెస్టు క్రికెట్లో 50 మ్యాచ్ ల్లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రెండోఆటగాడిగా విరాట్ కొహ్లీ నిలిచాడు. సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న 49 టెస్టుల రికార్డును కొహ్లీ అధిగమించాడు. సౌతాఫ్రికాతో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన రెండోటెస్టుతో.. కెప్టెన్ గా కొహ్లీ 50 మ్యాచ్ ల మైలురాయిని చేరాడు.  సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న 49 […]

అత్యధిక టెస్ట్ విజయాల కెప్టెన్ విరాట్
X
  • 50 టెస్టుల్లో 30 విజయాలతో కొహ్లీ జోరు

టెస్టు క్రికెట్లో 50 మ్యాచ్ ల్లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రెండోఆటగాడిగా విరాట్ కొహ్లీ నిలిచాడు. సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న 49 టెస్టుల రికార్డును కొహ్లీ అధిగమించాడు.

సౌతాఫ్రికాతో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన రెండోటెస్టుతో.. కెప్టెన్ గా కొహ్లీ 50 మ్యాచ్ ల మైలురాయిని చేరాడు.

సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న 49 టెస్టుల రికార్డును అధిగమించి ..గతంలో ఇదే ఘనత సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ తర్వాతి స్థానంలో నిలిచాడు.

2008 నుంచి 2014 మధ్యకాలంలో భారతజట్టు 60 టెస్టుల్లో ధోనీ నాయకత్వం అందించగా..2014 నుంచి ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్ వరకూ విరాట్ కొహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

30 విజయాల విరాట్ కొహ్లీ…

టెస్టు క్రికెట్లో భారత్ కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా విరాట్ కొహ్లీ తన రికార్డును తానే మెరుగుపరచుకొన్నాడు. ప్రస్తుత పూణే టెస్ట్ వరకూ మొత్తం 50 మ్యాచ్ ల్లో కొహ్లీ 30 విజయాలతో 58కి పైగా విజయశాతం నమోదు చేశాడు.

భారతజట్టుకు 60టెస్టుల్లో నాయకత్వం వహించిన ధోనీ 27 విజయాలు మాత్రమే అందించగలిగాడు. సౌరవ్ గంగూలీ నాయకత్వంలో ఆడిన 49 టెస్టుల్లో భారత్ కు 21 విజయాలున్నాయి.

గ్రీమ్ స్మిత్ దే అగ్రస్థానం…

టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా సౌతాఫ్రికా కు చెందిన గ్రీమ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్ కెప్టెన్ గా ఆడిన 109 మ్యాచ్ ల్లో సౌతాఫ్రికా 53 విజయాలు సాధించింది.

ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్ర్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ రికీ పాంటింగ్ నిలిచాడు. ఆస్ట్ర్రేలియాకు కెప్టెన్ గా పాంటింగ్ 48 టెస్ట్ విజయాలు అందించాడు.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో టాప్ ర్యాంకర్ భారత్ కు ఇది వరుసగా నాలుగో గెలుపు కావడం విశేషం.

వెస్టిండీస్ తో ముగిసిన రెండుమ్యాచ్ ల సిరీస్ ను 2-0తో నెగ్గిన భారత్…సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రస్తుత తీన్మార్ సిరీస్ లోని మొదటిరెండు టెస్టులూ నెగ్గడం ద్వారా సిరీస్ ఖాయం చేసుకోడమే కాదు…వరుసగా నాలుగో విజయం నమోదు చేయడం ద్వారా లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.

First Published:  13 Oct 2019 8:03 PM GMT
Next Story