వినాయక్ దర్శకత్వంలో వెంకీ?

గతంలో వీళ్లిద్దరి కాంబోలో లక్ష్మీ అనే సినిమా వచ్చింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఆ సినిమా వెంకీకి మంచి హిట్ అందించింది. అయితే 2006లో వచ్చిన ఈ సినిమా తర్వాత మళ్లీ కలుసుకోలేదు వీళ్లిద్దరు. ఎట్టకేలకు వినాయక్, వెంకటేష్ కాంబినేషన్ మరోసారి సెట్ అయ్యే అవకాశాలున్నాయి.

ఇప్పటికే ఓసారి వెంకటేష్ ను కలిశాడు వినాయక్. కథా చర్చలు కూడా జరిగాయి. నల్లమలపు బుజ్జి ఈ సినిమాను నిర్మిస్తాడు. వెంకీ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వెంకటేశ్-వినాయక్ కాంబినేషన్ లో సినిమాను ప్రకటిస్తారు. అయితే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి రావడానికి మాత్రం ఇంకాస్త టైమ్ పడుతుంది.

ప్రస్తుతం వినాయక్ హీరోగా మారాడు. సీనయ్య అనే ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత వెంకీతో సినిమా ఉంటుంది. ఈ గ్యాప్ లో తరుణ్ భాస్కర్ లేదా త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తాడు వెంకటేశ్. ఇంటలిజెంట్ సినిమా ఫ్లాప్ తర్వాత దర్శకుడిగా వినాయక్ గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే.